ఏపీలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఆగస్టు 4న సీట్ల కేటాయింపు జరిగింది. విద్యార్థులకు సీట్ల కేటాయింపు తర్వాత రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కేవలం 38.25 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,045 డిగ్రీ కళాశాలల్లో 3,33,757 సీట్లు అందుబాటులో ఉండగా.. కేవలం 1,27,659 మాత్రమే భర్తీ అయ్యాయి. డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కోసం మొదటి విడత ప్రవేశాల కోసం 1,46,737మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 1,29,653 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 1,27,659 మందికి సీట్లు కేటాయించారు. సీట్ల కేటాయింపు తర్వాత 16 కళాశాలల్లో ఒక్కరూ కూడా చేరకపోవడం గమనార్హం. ఫీజులు నిర్ణయించని కారణంగా మరో 150 కళాశాలలు కౌన్సెలింగ్‌కు దూరంగా ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీటిని రెండో విడత కౌన్సెలింగ్‌లో పెట్టనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 7లోగా సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
అలాట్‌మెంట్ లెటర్ కోసం క్లిక్ చేయండి..


OAMDC 2023 అడ్మిషన్ ప్రాసెస్..


OAMDC 2023 అడ్మిషన్ ప్రక్రియ మూడు దశల్లో నిర్వహిస్తారు.


మొదటి దశ: 12వ తరగతిలో 90% కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులకు మొదటి దశ ప్రవేశాలు ఉంటాయి.


రెండో దశ: 12వ తరగతిలో 80% మరియు 90% మార్కులు సాధించిన అభ్యర్థులకు రెండవ దశ ప్రవేశాలు ఉంటాయి.


మూడో దశ: 12వ తరగతిలో 80% కంటే తక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులకు మూడవ మరియు చివరి దశ ప్రవేశాలు ఉంటాయి.


OAMDC దరఖాస్తు సమర్పణ కోసం పత్రాల జాబితా..
➥ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ కాపీ
➥ ఇంటర్మీడియట్ బదిలీ సర్టిఫికేట్ (అసలు)
➥ 10వ తరగతి ఉత్తీర్ణత & మెమో సర్టిఫికెట్
➥ ఇంటర్మీడియట్ పాస్ & మెమో సర్టిఫికేట్
➥ కండక్ట్ & స్టడీ సర్టిఫికెట్లు  (గత 3 సంవత్సరాలు)
➥ MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం (SC, ST, BC విషయంలో)
➥ MRO జారీ చేసిన తాజా ఆదాయ ధృవీకరణ పత్రం
➥ నివాస ధృవీకరణ పత్రం
➥ NCC సర్టిఫికేట్లు (వర్తిస్తే)
➥ క్రీడా ధృవపత్రాలు (వర్తిస్తే)
➥ శారీరకంగా సవాలు చేయబడిన సర్టిఫికేట్ (వర్తిస్తే)
➥ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ
➥ యాంటీ ర్యాగింగ్/అండర్ టేకింగ్ ఫారమ్
➥ SC/ST ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం తల్లిదండ్రుల డిక్లరేషన్ ఫారమ్
➥ రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు


ALSO READ:


ఎంపీసీ విద్యార్థులకు 'స్పెషల్ కౌన్సెలింగ్‌' ద్వారా ఫార్మసీ సీట్ల కేటాయింపు
తెలంగాణలో రెండు విడతల ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 2తో ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ మొదలుకానుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సాధారణంగా ఏటా ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో వారికి సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఈసారి చివరి విడత తర్వాత ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో అవకాశం ఇచ్చేలా మార్పు చేశారు. ఆగస్టు 11తో చివరి విడత ప్రక్రియ పూర్తవుతుంది.  ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..