10th class paper valuation: ఏపీలో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకన (పేపర్ వాల్యూయేషన్) ప్రక్రియ ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 8 వరకు మూల్యాంకనం కొనసాగనుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ మూల్యాంకనం నిర్వహించనున్నట్లు సురేష్ వెల్లడించారు. మొత్తం 25 వేల మంది ఉపాధ్యాయులు 47,88,738 జవాబుపత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు విద్యాశాఖ కమిషనర్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 18 నుంచి 30 వరకు నిర్వహించిన పరీక్షలకు దాదాపు 7.25 లక్షల వరకు విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6.23 లక్షల మంది రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు 1.02 పూర్వవిద్యార్థులు ఉన్నారు.


మే మొదటి వారంలోనే ఫలితాలు..
మే మొదటి వారానికి మూల్యాంకన ప్రక్రియ అంతా పూర్తిచేసి, ఎన్నికల కమిషన్‌ అనుమతితో, ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఫలితాలు ప్రకటించాలనే లక్ష్యంతో ఉన్నామని ష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానంద్‌ రెడ్డి తెలిపారు. మూల్యాంకనం కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించామని దేవానంద్‌రెడ్డి తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో గతంలో నిర్వహించిన చోట సరైన సౌకర్యాలు లేవని గుర్తించి, ఈసారి వాటిని అనువైన భవనాల్లోకి మార్పు చేశామన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రాల్లో వైద్య ఆరోగ్యశాఖ కో–ఆర్డినేషన్‌తో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు.


ప‌దోతరగతి ప‌రీక్ష పేప‌ర్ల మూల్యాంకనంలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కా­రం ఇవ్వొద్దని డీఈవోలకు స్పష్టమైన ఆదేశాలిచ్చా­మని దేవానంద్‌ తెలిపారు. అనుమానాలు నివృత్తి చేసుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈసారి ఆన్‌లైన్‌ విధానం తీసుకొచ్చామన్నారు. రీ వ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్‌ కోసం రూ.1000 ఫీజు చెల్లించే విద్యార్థులకు ప్రత్యేక వెబ్‌ లింక్‌ ద్వారా వారి సెల్‌ఫోన్‌కు మూల్యాం­కనం చేసిన జవాబు పత్రాన్ని పంపిస్తామన్నారు.


ఈ ఏడాది రాష్ట్రంలో 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్‌గా, 1.02 లక్షల మంది ప్రైవేటుగా పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. మొత్తంగా 50 లక్షల జవాబు పత్రాలకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించి, 8వ తేదీనాటికి పూర్తి చేయాలని జిల్లాల యంత్రాంగానికి లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు దేవానంద్‌ రెడ్డి. ఇందు కోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు.


పదోతరగతి ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..





Step 1 : పదోతరగతి ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలి - bse.ap.gov.in


Step 2 : అక్కడ హోంపేజీలో 'ఫలితాలకు' సంబంధించిన లింక్‌‌పై క్లిక్ చేయాలి.








Step 3 :  అక్కడ వివరాలు నమోదు చేసి, Submit బటన్‌ మీద క్లిక్ చేాయాలి.








Step 4 : పదోతరగతి ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.







Step 5 : విద్యార్థులు తమ ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోవాలి




ALSO READ:


అనాథ చిన్నారులకు 'హీల్ ప్యారడైజ్' ఆపన్నహస్తం - ఉచిత చదువు, వసతి సదుపాయాలు
తల్లితండ్రులను కోల్పోయి లేదా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి నిరాదరణకు గురయ్యే చిన్నారులకు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలోని 'హీల్ ప్యారడైజ్' పాఠశాల చేయూతనిస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి 12 కి.మీ. దూరంలో 60 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన ఈ పాఠశాలలో అనాథ పిల్లలకు ఉచిత విద్యతోపాటు.. వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. కార్పొరేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీర్చిదిద్దారు. దేశంలో ఏ ప్రాంతంవారైనా ఇక్కడ చేరవచ్చని.. హీల్ ప్యారడైజ్ పాఠశాల నిర్వాహకుడు డాక్టర్ కోనేరు సత్యప్రసాద్, కార్యదర్శి తాతినేని లక్ష్మి, సీఈవో కె.అజయ్ కుమార్ తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...