జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను తొమ్మిదో తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు. రాతపరీక్ష ఆధాంగా విద్యార్థులను ఎంపికచేస్తారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివరాలు..
* నవోదయ ప్రవేశ పరీక్ష 2022 (తొమ్మిదో తరగతి)
అర్హత: 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
వయోపరిమితి: 01.05.2008 నుంచి 30.04.2010 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో మార్కుల ఆధారంగా.
పరీక్ష వివరాలు: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఇంగ్లిష్-15 మార్కులు, హిందీ-15 మార్కులు, గణితం-35 మార్కులు, జనరల్ సైన్స్-35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. అభ్యర్థులు ఒక్కో విభాగంలో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. కాని మెరిట్ లిస్టు తయారీలో మాత్రం గణితం, సైన్స్, ఇంగ్లిష్ లేదా హిందీలో ఎక్కువ మార్కులు దేనిలో వస్తే దాని మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
పరీక్ష తేదీ: 11-02-2023.
పరీక్ష కేంద్రాలు: సంబంధిత జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాలు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.10.2022.
పరీక్ష సిలబస్:
Also Read:
AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్ విడుదల
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏడాదిలో రెండు సార్లు దూరవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో సూచించినట్లు ఇంటర్, డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి
Also Read:
UOH PhD: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2022 -23 ఏడాదికి వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 42 కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 281 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. వీటిలో జనరల్ అభ్యర్థులకు 99 సీట్లు, ఎస్సీ అభ్యర్థులకు 43 సీట్లు, ఎస్టీ అభ్యర్థులకు 21 సీట్లు, ఓబీసీ అభ్యర్థులకు 76 సీట్లు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 28 సీట్లు, దివ్యాంగులకు 14 సీట్లు కేటాయించారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..