AP EdCET 2025 Application: ఆంధ్రప్రదేశ్‌‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి 'ఏపీ ఎడ్‌సెట్‌-2025' నోటిఫికేషన్‌ను గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఏప్రిల్ 8న విడుదల చేసింది. నోటిఫికేషన్‌తోపాటు దరఖాస్తు ప్రక్రియను కూడా ఏప్రిల్ 8న ప్రారంభించింది. ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉన్నవారు ఎడ్‌సెట్-2025కు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు మే 14 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు సమర్పించవచ్చు. 

దరఖాస్తు ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.450 చెల్లించాలి. అయితే రూ.1000ల ఆలస్య రుసుముతో మే 19 వరకు, రూ.2000ల ఆలస్య రుసుముతో మే 23 వరకు; రూ.4000ల ఆలస్య రుసుముతో మే 26 వరకు; రూ.10,000ల ఆలస్య రుసుముతో జూన్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష హాల్‌టికెట్లు మే 30 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్‌ కీని జూన్ 10న విడుదల చేస్తారు. ఆ తర్వాత జూన్ 13న సాయంత్రం 5 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫైనల్ కీతోపాటు ఎడ్‌సెట్ ఫలితాలను జూన్ 21న విడుదల చేస్తారు.

వివరాలు..

* ఏపీఎడ్‌సెట్ - 2025 (APEdCET-2025)

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ/బీఎస్సీ(హోంసైన్స్)/బీకామ్/బీసీఏ/బీబీఎం అర్హత (లేదా) 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ అర్హత ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి: 01.07.2025 నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయోపరిమితిలేదు.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.450 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం:  

➥ మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 120 నిమిషాలు. 

➥ పరీక్షలో మొత్తం మూడు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు-25 మార్కులు, పార్ట్-బి: జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు-15 మార్కులు, టెక్నికల్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్-సిలో మెథడాలజీ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. మెథడాలజీలో అభ్యర్థులు ఎంపికచేసుకునే సబ్జె్క్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.

➥ మెథడాలజీలోలో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ (జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్), ఇంగ్లిష్ సబ్జె్క్టులు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు...

➥ నోటిఫికేషన్ వెల్లడి: 08-04-2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08-04-2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14-05-2025.

➥ రూ.1000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 15-05-2025 నుండి 19-05-2025 వరకు.

➥ రూ.2000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 20-05-2025 నుండి 23-05-2025 వరకు.

➥ రూ.4000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 24-05-2025 నుండి 26-05-2025 వరకు.

➥ రూ.10,000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 27-05-2025 నుండి 03-06-2025 వరకు.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 24.05.2025  నుండి 28.05.2024 వరకు.

➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 30.05.2025 నుంచి.

➥ ఏపీ ఎడ్‌సెట్-2025 పరీక్ష తేది: 05.06.2025.     (పరీక్ష సమయం: మ.2.00 గం. సా.4.00 గం. వరకు.)

➥ ఎడ్‌సెట్ ప్రిలిమినరీ కీ అప్‌లోడ్: 10.06.2025. 

➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 13.06.2024.

➥ ఫలితాల వెల్లడి: 21-06-2025.

AP EDCET 2025 Notification

Fee Payment

Online Application

Website