ANUEET-2024 Notification: గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి డాక్టర్ వైఎస్సార్ ఏఎన్‌యూ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో డ్యూయల్ డిగ్రీ (బీటెక్+ఎంటెక్) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేవ పరీ హాల్‌టికెట్లను ఏప్రిల్ 1 నుంచి అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులకు ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష నిర్వహించి, ఏప్రిల్ 10న ఫలితాలను వెల్లడించనున్నారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.
వివరాలు..
* బీటెక్+ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్
మొత్తం సీట్ల సంఖ్య: 510.
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ.
అర్హత: కనీసం 45 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, కౌన్సెలింగ్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం మూడు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట-సి) ఉంటాయి. ఇందులో 'పార్ట్-ఎ'లో మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-40 మార్కులు, 'పార్ట్-బి'లో ఫిజిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, 'పార్ట్-సి'లో కెమిస్ట్రీ-30 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్ మాధ్యమంలోనే ప్రశ్నలు అడుగుతారు. మ్యాథ్స్ (40 ప్రశ్నలు), ఫిజిక్స్ (30 ప్రశ్నలు), కెమిస్ట్రీ (30 ప్రశ్నలు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
పరీక్ష కేంద్రాలు: విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 06.02.2024.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.03.2024.
➥ రూ.750 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.06.2023.
➥ రూ.1250 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.03.2024.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 01.04.2024.
➥ ప్రవేశ పరీక్షతేది: 07.04.2024.
➥ ఫలితాల వెల్లడి: 10.04.2024.
ALSO READ:
నీట్ యూజీ - 2024 నోటిఫికేషన్ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (National Eligibility-cum-Entrance Test) యూజీ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 9న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. నీట్ యూజీ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు.
నీట్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..