8th Pay Commission: పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. స్థిరత్వం, మంచి జీతాలు, సకాలంలో చెల్లింపులు, భవిష్యత్తు భద్రత కారణంగా చాలా మంది ఈ ఉద్యోగాలు సాధించేందుకు చదువుతుంటారు. గ్రామీణ ప్రాంతాలు, నగరాల్లో పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆధునికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా పని తీరు మార్చుకొని ప్రజలకు సేవలు చేస్తున్నాయి. అందుకే నేటీకీ వాటి అవసరం ప్రజలకు ఉంటోంది. తత్ఫలితంగా, ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో యువకులు పోస్టల్ డిపార్టమెంట్‌లోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. అలాంటి ఉద్యోగులకు 8వ వేతన సంఘం రిపోర్టు తర్వాత ఏ స్థాయిలో జీతాలు పెరుగుతాయో అన్న చర్చ మొదలైంది.
పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో క్లార్క్ ఉద్యోగానికి సాధారణంగా కనీసం 12వ తరగతి లేదా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్లు అర్హులు. అనేక పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం. కంప్యూటర్లు, టైపింగ్ పరిజ్ఞానంతోపాటు మంచి విద్య ఉన్న అభ్యర్థులు ఎంపికలో ప్రయోజనాన్ని పొందుతారు.
ప్రస్తుత జీతం ఎంత?
నివేదికల ప్రకారం, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లోని క్లర్క్ పే మ్యాట్రిక్స్ లెవల్ 2 కిందకు వస్తాయి, గ్రేడ్ పే ₹1,900. 7వ వేతన కమిషన్ ప్రకారం, క్లర్క్ బేసిక్ శాలరీ ₹19,900గా నిర్ణయించారు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు బేసిక్ శాలరీతోపాటు చాలా అంశాలు జీతంలో కలుస్తుంటాయి. వాటిలో అనేక భత్యాలు ఉంటాయి.
ఈ భత్యాలలో డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె భత్యం (HRA), ప్రయాణ భత్యం (TA), ఇతర డిపార్ట్‌మెంటల్ అలవెన్సులు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే, ఒక క్లర్క్ మొత్తం చేతికి వచ్చేది ₹37,120 నుంచి ₹39,370 మధ్య ఉంటుంది. అందుకే ఈ ఉద్యోగం యువతలో ప్రజాదరణ పొందింది.
ఫిట్‌మెంట్ కారకం అంటే ఏంటి?
కొత్త పే కమిషన్ ప్రకటించినప్పుడల్లా, ఫిట్‌మెంట్ కారకం ఎక్కువగా చర్చలోకి వస్తుంది. ఫిట్‌మెంట్ ఆధారంగా కొత్త జీతాలు నిర్ణయిస్తారు. దీనిని నిర్ణయించేటప్పుడు, ప్రభుత్వం దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల, ఉద్యోగుల అవసరాలు, ప్రభుత్వ కెపాసిటీ పరిగణనలోకి తీసుకుంటుంది. 7వ వేతన కమిషన్‌లో, ఫిట్‌మెంట్ కారకం 2.57 రెట్లు ఉండేది, ఉద్యోగుల కొత్త జీతాలు దీని ఆధారంగా నిర్ణయించారు. ఇప్పుడు 8వ వేతన కమిషన్‌లో ఈ కారకం 2.86 వరకు పెరగవచ్చని భావిస్తున్నారు.