ఎంసెట్ తొలివిడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేసే కన్వీనర్ కోటా సీట్లకు అదనంగా మరో 6,500 బీటెక్ సీట్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు కేటాయించనున్నారు. కన్వీనర్ కోటాలో రెండు రోజుల క్రితం వరకు 62,069 సీట్లు ఉండగా తర్వాత కళాశాలల సంఖ్య పెరగడంతో సీట్ల సంఖ్య 65 వేలకు చేరింది. తాజాగా కన్వీనర్ కోటా సీట్లకు అదనంగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద కేటాయించారు. ఆ ప్రకారం మరో 6,500 సీట్లు అదనంగా చేరనున్నాయని ఎంసెట్ వర్గాలు తెలిపాయి.


అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌టీలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నందున తొలిసారిగా ఎంసెట్ కన్వీనర్ కోటాలో ఆ మేరకు సీట్లు కేటాయించనున్నారు. పలు కళాశాలలు ఈసారి డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకొని కంప్యూటర్ సైన్స్, సంబంధిత బ్రాంచీల్లో సీట్లను పెంచుకున్నాయి. వాటికి త్వరలోనే అనుమతి వస్తుందని, దానివల్ల మరో మూడు నాలుగు వేల సీట్లు పెరుగుతాయని భావిస్తున్నారు.


జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, హైదరాబాద్‌గా ఉన్న పేరును జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ‌గా మార్చారు. గతంలో ఈ వర్సిటీలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎస్‌టీ)ని ఇంజినీరింగ్ కళాశాలలో మిళితం చేసి పేరు మార్చారు.


ALSO READ:


ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్‌ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా బీఏ-బీఈడీ, బీఎస్‌ఈ-బీఈడీ, బీకాం-బీఈడీలను ప్రవేశపెట్టాలనే కేంద్రం నిర్ణయం మేరకు ఆ కోర్సులను రాష్ట్రంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఈ సంవత్సరమే కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లు ఐదు ఉండగా వాటిలో ఉన్న కోర్సుల్లో సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుపుతారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇక తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష! ఐఐటీ కౌన్సిల్‌లో నిర్ణయం!
జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్‌(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌‌కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్‌, జేఈఈ మెయిన్‌ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్‌, ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ప్రధానంగా ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఐఐటీ కౌన్సిల్‌ దృష్టి పెట్టింది. డ్రాపౌట్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి  నివేదికను ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కౌన్సిల్‌ ఆదేశించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్‌ మీటింగ్‌కు సంబంధించిన  తీర్మానాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial