విశాఖపట్నానికి చెందిన యూట్యూబర్ కోమలి (21) హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. చదువు నిమిత్తం హైదరాబాద్ చేరుకున్న ఆమె, చిత్రపురి కాలనీలో నివాసం ఉంటోంది. తన అభిరుచి మేరకు యూట్యూబ్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, తమ ప్రాంతానికే చెందిన అఖిల్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో ఆమె కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అతను కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. వీరిద్దరి మధ్య ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కోమలి, తన గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
తన కుమార్తె మరణానికి అఖిల్ రెడ్డి కారణమని, అతను ప్రేమ పేరుతో మోసం చేయడం వల్లే కోమలి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి మంగళవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వర్ధమాన యూట్యూబర్‌గా
విశాఖలో అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త.. విశాఖపట్నం ఆరిలోవ బాలాజీ నగర్ పరిధిలో అనుమానం ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. తన భార్య ప్రవర్తనపై కొంతకాలంగా అనుమానం పెంచుకున్న బురదపాటి దేముడు (42), మంగళవారం ఉదయం తన భార్య దుర్గ (33)ను చున్నీతో గొంతు నులిమి హత్య చేశాడు. భార్యాభర్తలు ఇద్దరూ నగరంలోని లైఫ్ స్టైల్ షోరూమ్‌లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం వీరిద్దరి మధ్య మరోసారి జరిగిన గొడవ తీవ్రరూపం దాల్చడంతో, ఆవేశంలో దేముడు తన భార్య దుర్గను హత్య చేశాడు.
ఎలా దొరికిపోయాడంటే..
తమ కుమార్తె నుంచి ఎలాంటి ఫోన్, మెస్సేజ్ రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి నర్సింహులు, ఇంటికి వెళ్లి తలుపులు పగులగొట్టి చూడగా దుర్గ చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా, నిందితుడు ఇంట్లోనే దాక్కుని దొరికిపోయాడు. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకునేందుకు ముందు ఇంట్లోని ఫ్రిడ్జ్ వెనుక దాక్కున్నాడు. అయితే ఇంటి బయట బైక్ ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులు గాలించగా నిందితుడు దేముడు దొరికిపోయాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ మల్లేశ్వరరావు నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.