Attack On Girlfriend: భాగ్యనగరం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి విజయ నగర కాలనీలో దారుణం జరిగింది. తనను ప్రేమించాలంటూ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిపై కత్తితో దాడి చేశాడు. ఆపై ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు.. నగరంలో ఉంటున్న రాజు అనే యువకుడు కొద్ది కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తనను ప్రేమించాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. అందుకు యువతి అంగీకరించకపోవడంతో పగ పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం యువతితో గొడవ పడ్డాడు. తనను ప్రేమించాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు యువతి అంగీకరించకపోవడంతో రాజు కోపంతో రగిలిపోయాడు. తనతో తెచ్చుకున్న కత్తితో లీలా నాగజ్యోతిపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఘటనలో నాగజ్యోతికి తీవ్రగాయాలు అయ్యాయి. తరువాత తాను ఆత్మహత్యయత్నం చేశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగజ్యోతి, రాజులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం తమదైన శైలిలో విచారణ ప్రారంభంచారు. నాగజ్యోతి ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. నిందితుడు రాజు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.