Woman murders neighbours child hides body in washing machine : తమిళనాడులో రాధాపురం తాలూకాలో అతుకురిచ్చి అనే గ్రామలో బాలుడు మిస్సయినట్లుగా ఫిర్యాదు రావడంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎక్కడ చూసినా కనిపించలేదు. చివరికి బాలుడి పక్కింట్లో సోదాలు చేస్తున్నప్పుడు వాషింగ్ మెషిన్ లో ఏదో ఉన్నట్లుగా గుర్తించి తీయడంతో.. బాలుడి మృతదేహం బయటపడింది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు.
పక్కింటి వ్యక్తితో గొడవలతో అతని కుమారుడి హత్య
బాలుడి పక్కింట్లో ఉండే తంగమ్మాల్ అనే మహిళకు నలభై సంవత్సరాలు ఉంటాయి. ఆమె తగవుల మారి. పక్కింట్లోళ్లతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. అలా పక్కింట్లో ఉండే మగ వ్యక్తితో గొడవ పడింది. ఈ కోపం మనసులో ఉంచుకుంది. ఉదయం బయట ఆడుకుంటున్న మూడేళ్ల పక్కింటి వాళ్ల అబ్బాయిని ఇంట్లోకి పిలిచింది. ఎందుకు పిలిచిందో తెలియని ఆ మూడేళ్ల పిల్లగాడు వెళ్లాడు. అలా వెళ్లిన వాడు మళ్లీ తిరిగి రాలేదు. అ బాబు తల్లి కంగారు పడి ఊరంతా వెదికింది. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సెర్చ్ చేసి తంగమ్మాల్ ఇంట్లో వాషింగ్ మెషిన్ లో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు.
చంపేసి వాషింగ్ మెషిన్ లో దాచి పెట్టిన తంగమ్మాల్
పోలీసులు తమదైన ట్రీట్ మెంట్ ఇవ్వడంతో బాలుడ్ని తానే చంపానని ఒప్పుకుంది. పక్కింటి వాళ్ల మీద కోపంతో పసివాడి ప్రాణం తీశానని ఒప్పుకుంది. ఈ కేసు తమిళనాడులో సంచలనం సృష్టించింది. పాత కక్షల వల్లే పిల్లగాడిని చంపానని తంగమ్మాల్ పోలీసులకు చెబుతున్నారు.అదేనా అంతకు మించి ఇంకమైనా ఉందా అన్నదానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. నలభై ఏళ్ల తంగమ్మాల్ కూడా.. కూడా ఓ కొడుకు ఉండేవాడు. అయితే ఇటీవల ఆ కుమారుడు ప్రమాదంలో చనిపోయాడు. అప్పట్నుంచి ఆమె మానసిక స్థితి కూడా సరిగా లేదని భావిస్తున్నారు. తమకు లేని కొడుకు పక్కింటి వాళ్లకు మాత్రం ఎందుకు ఉండాలన్న ఈర్ష్యతో ఇలా చేసి ఉండవచ్చని అనుమానిపిస్తున్నారు.
కొద్ది రోజుల కిందట యాక్సిడెంట్ లో కుమారుడ్ని కోల్పోయిన తంగమ్మాల్
హత్యకు గురైన మూడేళ్ల పిల్లవాడి పేరు సంజయ్. అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తాము చేసిన తప్పేమిటని అంటున్నారు. అయితే తంగమ్మాల్ మాత్రం.. నింపాదిగా పోలీసు స్టేషన్ లో కూర్చున్నారు. ఓ జంటకు కడుపు కోత మిగిల్చానని ఆమె అనుకోవడం లేదు.