Nandyal Woman kills her husband for illicit relationship | నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. కొలిమిగుండ్ల మండలం పెట్నికోటలో ఈ ఘటన కలకలం రేపుతోంది.


అనంతపురం జిల్లా పుట్లూరుకు చెందిన వేణుగోపాల్ తో ఓ మహిళకు కొంతకాలం కిందట పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ఇంట్లో విషయం భర్తకు తెలిసింది. దాంతో గత కొద్దిరోజుల నుంచి ఇంట్లో భార్య భర్తలకు మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. భార్య అక్రమ సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని అవేశంతో ఆ ప్రియుడు వేణుగోపాల్ తో కలిసి ప్లాన్ చేసింది.


నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలిసి దారుణం


ఈ నెల 26 వ తేదీన రాత్రి రమేష్ నిద్రిస్తున్న సమయంలో భార్య, ఆమె ప్రియుడు వేణుగోపాల్ మరో వ్యక్తి ఆయన స్నేహితుడు ఇంటికి వచ్చారు. నిద్రపోతున్న రమేష్ ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి  హతమార్చారు. ఉదయం తెల్లవారేసరికి నా భర్త మృతి చెందాడు ఏం జరిగిందో ఏమో అని గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులకు తెలిపింది. గ్రామానికి చేరుకున్న బంధువులు భార్య వ్యవహారంపై అనుమానం రావడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.



రంగంలోకి దిగిన కొలిముగుండ్ల సిఐ రమేష్ బాబు వెంటనే రమేష్ భార్యను ప్రశ్నించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.  తమదైన స్టైల్ లో విచారించగా వివాహిత చేసిన నేరం అంగీకరించింది. అనంతపురం జిల్లా పుట్లురుకు చెందిన వేణుగోపాల్ తో అక్రమ సంబంధం విషయంలో భర్త అడ్డు వస్తున్నాడన్న కారణంతోనే హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించింది. డిఎస్పి రవికుమార్ మీడియాకు ఈ విషయాలు తెలిపారు. హత్యకు సహకరించిన భార్యతోపాటు ప్రియుడు వేణుగోపాల్, అతడి స్నేహితుడు ముగ్గురుని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి బైక్ ను స్వాధీనం చేసుకొన్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ రవికుమార్  తెలిపారు.


Also Read: Rishiteshwari Case: సంచలన కేసులో బిగ్ ట్విస్ట్ - రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టేసిన న్యాయస్థానం, తమకు ఆత్మహత్యే శరణ్యమన్న పేరెంట్స్