Happy New Year 2026 | హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్ పెడ్లర్లు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు డ్రగ్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు డ్రగ్స్ పెడ్లర్లు కొత్త దారుల్లో తమ దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా గోవా నుండి హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్ తరలిస్తున్న యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌కు చెందిన హస్సా అనే యువతి ఎక్కువ డబ్బు సంపాదించాలని, గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తుండగా అమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
2024 డిసెంబర్‌లో గోవా పర్యటనలో మొదటిసారి MDMA రుచి చూసిన ఆమె, క్రమంగా దానికి బానిసగా మారింది. ఆ తర్వాత కేవలం వినియోగదారురాలిగానే కాకుండా, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే డ్రగ్ పెడ్లర్‌గా మారి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నైజీరియా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలుబంజారాహిల్స్‌కు చెందిన హస్సాకు గోవాలోని నైజీరియన్ డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నైజీరియా గ్యాంగ్ నుంచి తక్కువ ధరకు MDMA, LSD వంటి ఖరీదైన డ్రగ్స్‌ను కొనుగోలు చేసి, హైదరాబాద్‌లోని యువతకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది మార్చి నుండి ఆమె పలుమార్లు గోవాకు వెళ్లి అక్కడినుంచి నగరానికి అక్రమంగా డ్రగ్స్ తరలించింది. ఈ నెల 26న గోవాలోని సియోలిమ్, మాపూసా ప్రాంతాల్లో ఆమె డ్రగ్ డీల్స్ చేసినట్లు ఆధారాలు లభించాయి. NDPS యాక్ట్ కింద గతంలో గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై జైలుకు వెళ్లినా బుద్ధి మారలేదు.
కొనసాగుతున్న పోలీసు దర్యాప్తుఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన హస్సా, మరికొందరు సహచరులతో కలిసి పకడ్బందీగా ఈ దందా చేస్తుండగ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తోంది, ఈ ముఠాలో ఇంకా ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టరు. డ్రగ్స్ లాంటి వాటిబారిన పడితే వారి జీవితాలతో పాటు ఎందరో జీవితాలు నాశనం అవుతాయని పోలీసులు, ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. జైలుకు వెళ్ళొచ్చినా కొందరిలో మార్పు రాకపోగా, డ్రగ్ పెడ్లర్లకు గా మారి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. డ్రగ్స్ లేదా ఇతర నేరాలు జరుగుతుంటే కింద తెలిపిన వాటికి ఫిర్యాదు చేయవచ్చు.
మాదకద్రవ్యాల కట్టడికి (Anti-Narcotics Bureau)డ్రగ్స్ అమ్మకాలు, వాడకం లేదా సరఫరాకు సంబంధించి సమాచారం ఇవ్వడానికి:
హెల్ప్‌లైన్ నంబర్: 1908 (టోల్ ఫ్రీ)వాట్సాప్ నంబర్: 87126 71111ఇమెయిల్: tsanb-hyd@tspolice.gov.in
సైబర్ నేరాల ఫిర్యాదులు (Cyber Crime)ఆన్‌లైన్ మోసాలు, పైరసీ వంటివి లేదా వేధింపులకు సంబంధించి:జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్: 1930 (24/7 అందుబాటులో ఉంటుంది)అధికారిక వెబ్‌సైట్: www.cybercrime.gov.in
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్: 040-23226037
ఇతర అత్యవసర సేవలుడయల్ 100: ఏదైనా నేరం జరుగుతున్నప్పుడు తక్షణ పోలీసు సహాయం కోసం.
హాక్ ఐ (Hawk eye) యాప్: తెలంగాణ పోలీసుల అధికారిక మొబైల్ యాప్ ద్వారా మీరు నేరుగా ఫోటోలు లేదా సమాచారాన్ని పోలీసులకు పంపవచ్చు.