Warangal Crime News: జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో వాహన బ్యాటరీ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి చెందిన నలుగురు దొంగల ముఠాను అదుపులోకి తీసుకునట్లు పోలీసులు తెలిపారు. రాత్రి వేళల్లో రోడ్డుపై పార్కింగ్ చేసిన వాహనాల బ్యాటరీలను దొంగతనం చేయడం వారి లక్ష్యం అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 50 వేలకు పైబడిన విలువగల బ్యాటరీలను ఈ గ్యాంగ్ దొంగలించినట్లు వివరించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో వీరిపై కేసులు నమోదు అయినట్లు సీఐ విశ్వేశ్వర్ వెల్లడించారు. సులభంగా డబ్బు సంబంధించేందుకు నిందితులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. 


ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి..!


వాహన బ్యాటరీలే దొంగల లక్ష్యం అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం అని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా వారి నివాసాలకు లేదా వ్యాపార సంస్థలకు కెమెరాలను పెట్టించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. చాకచక్యంగా పట్టుకున్న దేవరుప్పుల ఎస్ఐ రమేష్ నాయక్, సిబ్బందిని డీసీపీ సీతారాం అభినందించారు. ఏసీపీ శ్రీనివాస్ రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ పాల్గొన్నారు.


నకిలీ రెవెన్యూ పత్రాలతో దందాలు..


రెవెన్యూ విభాగంలో పనిచేసిన అనుభవంతో సులువుగా డబ్బు సంపాదించాలని చూసి రిటైర్డ్ వీఏఓ అడ్డంగా దొరికిపోయాడు. అతడితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి. నకిలీ రెవెన్యూ పత్రాలను సృష్టిస్తున్న మాజీ వి.ఏ.ఓ వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన మద్ది వెంకటరెడ్డి (70) తో పాటు కల్వచర్ల రఘు (50)ను టాస్క్ఫోర్స్, నెక్కొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పోలీసులు నకిలీ పట్టాదారు పాస్ బుక్‌లు, ఆర్టీఓకు సంబంధించిన సకిలీ ల్యాండ్ కన్వర్జేషన్ ప్రొసీడింగ్స్,130, సి ఫారాలు, ఎమ్మార్వో, ఆర్టీవో అధికారులకు సంబంధించిన నకిలీ ముద్రణలు, పహానీలు, కొటేషన్లు, బ్యాంకు చలాన్లు (Bank Challans) , గ్రామ నక్షాలు, స్టాంపు పేపర్లను పోలీసులు రిటైర్డ్ వి.ఏ.ఓ ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు.


వివరాలు వెల్లడించిన అదనపు డీసీపీ


ఈ అరెస్ట్ కు సంబంధించి అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ వివరాలను వెల్లడించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకడైన మద్ది వెంకటరెడ్డి 1973 సంవత్సరం నుంచి 2012 వరకు రెవెన్యూ విభాగంలో పట్వారీ, పంచాయితీ కార్యదర్శి, విఏఓ నెక్కోండ, పర్వతగిరి మండలాల్లో పనిచేసి పదవీ విరమణ పొందాడు. కాని నిందితుడికి పదవీ విరమణ అనంతరం ఈజీ మనీ ఆలోచన తట్టింది. సులభంగా డబ్బు సంపాదించాలకున్నాడు. తాను రెవెన్యూ విభాగంలో సుదీర్ఘకాలం పని చేసిన అనుభవంతో నకిలీ సకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆర్టీఓకు సంబంధించిన నకిలీ ల్యాండ్ కన్వర్జేషన్ ప్రొసీడింగ్స్,13జి, సి ఫారాలు తయారీ మొదలుపెట్టాడు. ఈ విధంగా తయారు చేసిన నకిలీ పాస్ బుక్ లు పత్రాలపై మరో నిందితుడైన కల్వచర్ల రఘుతో ఎమ్మార్వో, ఆర్టీఓ సంతాకలను ఫోర్జరీ సంతకాలు చేసేవాడు. ఇలా సృషించిన నకిలీ రెవెన్యూ పత్రాలు అవసరమున్న వ్యక్తులకు అందజేసి నిందితులు సొమ్ము చేసుకుంటున్నారు.