Warangal MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వద్ద శిశువును కుక్కలు పీక్కుతిన్న దారుణ ఘటన చోటుచేసుకుంది. నవజాత శిశువును కుక్కలు పట్టుకొచ్చి ఆస్పత్రి క్యాజువాలిటీ ఎదుట తింటుండడంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు, రోగుల బంధువులు చెదరగొట్టారు. శిశువును బెడ్ షీట్లు వేసి ఆస్పత్రి అధికారులకు సమాచారం అందించారు సెక్యూరిటీ సిబ్బంది. మృత శిశువు ఆడన, మగన అనేది తెలియలేదు. కుక్కలు సగం వాడిని తినివేయడంతో గుర్తుపట్టడం కష్టంగా ఉంది. అసలు ఈ ఘటన ఎంజీఎం పిల్లల వార్డులో జరిగిందా లేక బయట నుంచి ఈ శిశువును తీసుకువచ్చాయా అనే కోణంలో ఎంజీఎం అధికారులు, పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు. 


ఆస్పత్రి బయటనుండి శిశువును కుక్కలు పట్టుకొచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఎంజీఎంలోని పిల్లల వార్డులోకి కుక్కలు వెళ్లి పరిస్థితి లేదని ఆస్పత్రి అధికారుల వాదన. కుక్కలు మృత శిశువును పట్టుకొచ్చాయా... లేక ఎవరైనా  శిశువును పదీసివేళ్లరా అనే కోణంలో వరంగల్ ఏసిపి నందిరాం నాయక్, ఎంజీఎం అధికారులు విచారణ జరుపుతున్నారు. మృత శిశువును ఎంజీఎం మార్చూరులో భద్రపరిచారు.