Vijayawada Crime: విజయవాడలో దారుణం.. ప్రియురాలిపై ప్రేమోన్మాది కత్తితో దాడి, ఆపై ఆ*త్మహత్య
Vijayawada Crime: విజయవాడలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అనుమానంతో ప్రియురాలి గొంతుకోసి హత్యచేశాడు. ఆపై బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Vijayawada Crime: విజయవాడలో ఒక ప్రేమోన్మాది బీభత్సం సృష్టించాడు. ప్రియురాలిపై అనుమానంతో కత్తితో గొంతు కోశాడు. ఆ తర్వాత తాను కూడా డాబా పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ భయానక ఘటన విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.
ఘటన వివరాలు
స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. చిన్నారావు (22), మహాలక్ష్మి (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మహాలక్ష్మిపై చిన్నారావు అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో, క్షణికావేశానికి గురైన చిన్నారావు వెంట తెచ్చుకున్న కత్తితో మహాలక్ష్మి మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై యువతి కుప్పకూలింది.
Also Read: శ్రీసిటీ ప్రమాదంలో కార్మికుల మృతి.. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు
డాబా పైనుంచి దూకి యువకుడు మృతి
ప్రియురాలపై కత్తితో దాడి చేసిన అనంతరం తీవ్ర భయాందోళనకు గురైన చిన్నారావు, అదే భవనం పై నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రక్తపుమడుగులో పడి ఉన్న యువతి మహాలక్ష్మిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమోన్మాది దాడితో న్యూ రాజరాజేశ్వరిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read: అనంతగిరి ఘాట్ రోడ్డులో ట్రావెల్స్ బస్సు బోల్తా.. నలుగురు మృతితో తీవ్ర విషాదం
ట్రెండింగ్ వార్తలు






















