US Man Arrest: 


అమెరికాలో ఘటన..


అమెరికాలో ఓ సిక్కు యువకుడిపై దాడి జరిగింది. బస్‌లో తలపాగా పెట్టుకుని ప్రయాణిస్తున్న యువకుడిపై మరో అమెరికన్ యువకుడు దాడి చేశాడు. కేవలం టర్బన్‌ (Turban) పెట్టుకున్నందుకే భౌతిక దాడికి దిగాడు. పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ యువకుడికి క్రిమినల్ హిస్టరీ ఉంది. నాలుగేళ్ల క్రితం ఓ కేసులో అరెస్ట్ అయ్యి దాదాపు రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2021 జులైలో పరోల్‌పై బయటకు వచ్చాడు. ఇప్పుడు మరోసారి యువకుడిపై దాడి చేసి జైలు పాలయ్యాడు. అక్టోబర్ 15న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. న్యూయార్క్‌ సిటీ MTA బస్‌స్టాండ్‌ వద్ద టర్బన్ ధరించిన సిక్కు యువకుడితో వాగ్వాదానికి దిగాడు. అమెరికాలో ఎవరూ ఈ తలపాగా చుట్టుకోరని వాదించాడు. వెంటనే తొలగించాలని హెచ్చరించాడు. కానీ అందుకు ఆ సిక్కు యువకుడు ఒప్పుకోలేదు. వెంటనే అతడి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. తలకి తీవ్ర గాయాలయ్యాయి. బలవంతంగా ఆ తలపాగాని తొలగించాలని ప్రయత్నించాడు నిందితుడు. ఈ మధ్య పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు నిందితుడు. ఈ ఘటనపై బాధితుడు స్పందించాడు. మరెవరికీ ఇలాంటి అనుభవం ఎదురు కాకూడదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికి బాధితుడు ఇంకా ఆ భయంలోనే ఉన్నాడు. బాధితుడి కుటుంబం కూడా ఆందోళన చెందుతోంది. చికిత్స తీసుకోడానికీ బాధితుడు అంగీరించలేదు. కుటుంబ సభ్యులు ఎలాగోలా ఒప్పించి వైద్యం చేయిస్తున్నారు. 


యూకేలోనూ సిక్కుపై దాడి..


భారత్‌ కెనడా మధ్య ముదురుతున్న వివాదం విదేశాల్లోనూ అలజడి రేపుతోంది. ఇప్పటికే స్కాట్‌లాండ్‌లో భారత హైకమిషనర్‌ ఓ గురుద్వారలోకి వెళ్లగా కొందరు సిక్కులు అడ్డుకున్నారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. యూకేలోని సిక్కు రెస్టారెంట్ ఓనర్‌ కార్‌పై దాడి జరిగింది. ఖలిస్థాన్ మద్దతుదారులు తన కార్‌ని ధ్వంసం చేశారని ఆ ఓనర్ వెల్లడించారు. గతంలో ఖలిస్థాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు హర్మన్ సింగ్. అప్పటి నుంచి ఖలిస్థాన్ సపోర్టర్స్ ఆయనను టార్గెట్ చేశారు. ఈ ఏడాది మే నెలలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ని కారణంగా చూపించి పదేపదే దాడులు చేస్తున్నారు. చంపేస్తామంటూ కుటుంబాన్నీ బెదిరిస్తున్నట్టు హర్మన్ సింగ్ చెప్పాడు. ఇంటి ముంది పార్క్ చేసి ఉన్న రెండు కార్లనూ ధ్వంసం చేసినట్టు ఆరోపించాడు. తరవాతి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది మే నెలలో టిక్‌టాక్‌లో హర్మన్ సింగ్ ఖలిస్థాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ ఓ వీడియో అప్‌లోడ్ చేశాడు. కేవలం రెండు రోజుల్లోనే ఈ వీడియో వైరల్ అయింది. అప్పటి నుంచి ఖలిస్థాన్ సపోర్టర్స్ హర్మన్ సింగ్‌కి బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఆ వీడియో డిలీట్ చేయాలని బెదిరించారు. లేదంటే కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 


Also Read: ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ దారుణ హత్య, రోడ్డు పక్కన చెత్త కవర్‌లో డెడ్‌బాడీ