Tirupati Two people died in Car : ఆ ఇద్దరు అన్నదమ్మలు కారులో మద్యం తాగారు. ఎవరికీ కనిపించకుండా ఉండాలని కారుపై టార్పాలిన్ కప్పుకున్నారు. మద్యం  తాగిన తర్వాత ఇద్దరూ కారులోనే నిద్రపోయారు కానీ మళ్లీ లేవలేదు. డోర్లు వేసేసుకోవడం..  డోర్ గ్లాసులు కూడా కిందకు దింపకపోవడంతో వారికి గాలి ఆడలేదు. దాంతో ప్రాణాలు కోల్పోయారు. 

తిరుచానూరు రంగనాథ రోడ్డులో  ఈ ఘటన జరిగింది. దిలీప్ అనే యువకుడు, అతని బాబాయ్ కుమారుడు వినయ్‌లు రోడ్డు పక్కన నిలిపి ఉన్న తమ కారులో మద్యం తాగుదామని ప్లాన్ చేసుకున్నారు. ఇంట్లో వారికి తెలియకుండా సిట్టింగ్ కారులో పెట్టుకున్నారు.  రోడ్డు పక్కనే కారు ఉంది కాబట్టి ఎవరైనా చూస్తారేమోనని కారుపై టార్పాలిన్ కప్పుకున్నారు. ఏసీ వేసుకుని.. డోర్లు క్లోజ్ చేసుకున్నరాు. ఫుల్లుగా మద్యం తాగి.. కారులోనే పండుకున్నారు. కార్ ఇంజిన్ స్టార్ట్ చేసి.. ఏసీ ఆన్ చేసుకున్నారు. దాంతో సమస్య ఉండదని అనుకున్నారు. కానీ పెట్రోల్  అయిపోవడంతో ఏసీ ఆగిపోయింది. మద్యం మత్తులో నిద్రపోతున్న వారికి విషయం అర్థం కాలేదు. 

క్రమంలో వారికి గాలి ఆడలేదు. అది తెలియనంత మద్యం మత్తులో వారు ఉన్నారు. చివరికి గాలి ఆడకచనిపోయారు. తిరుచానూరు పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఎస్‌వీ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు.    కారు కిటికీలు మరియు డోర్లు పూర్తిగా మూసివేసి ఉంటే, గాలి ఆడే అవకాశం ఉండదు. దీనివల్ల కారులో ఉన్న ఆక్సిజన్ క్రమంగా తగ్గిపోతుంది.  కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు పెరుగుతాయి.  ఊపిరితో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ కారులోనే చేరడంతో, ఆక్సిజన్ అందక మెదడు, తర అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి, దీనివల్ల ఊపిరాడక మరణం సంభవిస్తుంది. కారు ఇంజన్ రన్ అవుతున్నప్పుడు  కార్బన్ మోనాక్సైడ్ (CO) విడుదలవుతుంది. ఈ వాయువు రంగులేని, వాసనలేని విషవాయువు. ఇది శరీరంలో ఆక్సిజన్‌ను రక్తం ద్వారా రవాణా చేసే హిమోగ్లోబిన్‌తో సులభంగా కలిసిపోతుంది.  కిటికీలు మూసివేసి ఉంటే, ఈ వాయువు కారులో చేరి, శరీరంలో ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటుంది. దీనివల్ల తలనొప్పి, మైకము, స్పృహతప్పడం,  చివరికి మరణం సంభవిస్తుంది.    తిరుచానూరు ఘటనలో, కారు ఇంజన్ ఆగిపోయినప్పటికీ, ఇంజన్ రన్ అయిన సమయంలో విడుదలైన కార్బన్ మోనాక్సైడ్ కారులో చేరి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఒక సాధారణ కారు లోపల ఆక్సిజన్ సరఫరా సీల్డ్ వాతావరణంలో గంటల వ్యవధిలో తగ్గిపోతుంది. ఇద్దరు వ్యక్తులు శ్వాసించడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు పెరిగి, ఆక్సిజన్ 21% నుంచి 16% కంటే తక్కువకు పడిపోతే, స్పృహ కోల్పోవడం, మరణం సంభవించవచ్చు. కారు ఇంజన్ నుంచి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ 0.1% (1000 ppm) కంటే ఎక్కువ సాంద్రతలో ఉంటే, కొన్ని నిమిషాల్లోనే మరణం సంభవించవచ్చు. కారు సీల్డ్ వాతావరణంలో ఉంటే, ఈ వాయువు త్వరగా చేరుతుంది. తిరుచానూరు  ఘటనలో, కారు ఇంజన్ పెట్రోల్ అయిపోవడంతో ఆగిపోయింది. అయితే, ఇంజన్ రన్ అయిన సమయంలో విడుదలైన కార్బన్ మోనాక్సైడ్ లేదా ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల మరణం సంభవించి ఉండవచ్చు.