Two candidates caught copying With help of AI:  గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాన్-టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో జరిగిన హైటెక్ కాపీయింగ్ కలకలం రేపుతోంది.  ఉద్యోగ నియామక పరీక్షల్లో పారదర్శకతను దెబ్బతీస్తూ సాగుతున్న హైటెక్ కాపీయింగ్ ముఠాల ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు అభ్యర్థులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యంత సూక్ష్మమైన బ్లూటూత్ పరికరాలను ఉపయోగించి బయటి వ్యక్తుల సాయంతో సమాధానాలు రాస్తున్న వీరిని పరీక్షా కేంద్రం సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు.                            

Continues below advertisement

హర్యానా నుంచి హెచ్‌సీయూలో ఉద్యోగ పరీక్ష వచ్చి  హైటెక్ కాపీయింగ్                            పట్టుబడ్డ అభ్యర్థులు హర్యానాకు చెందిన వారిగా గుర్తించారు. వీరు పరీక్షా హాలులోకి వెళ్లేటప్పుడే అత్యంత చిన్నవైన ఎలక్ట్రానిక్ పరికరాలను చెవుల్లో పెట్టుకుని వెళ్లారు. తమ దుస్తుల్లో అమర్చుకున్న ఒక చిన్న సిమ్ కార్డ్ ఆధారిత పరికరం ద్వారా బయట ఉన్న ముఠా సభ్యులతో కనెక్ట్ అయ్యారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత బయటి నుంచి వారికి సమాధానాలు చేరవేయడం మొదలైంది. అయితే, అభ్యర్థుల కదలికలపై అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్లు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది.                   

ఇలాంటి అక్రమాలకు పాల్పడే పెద్ద ముఠా ఉందని అనుమానం                             

Continues below advertisement

ఈ అక్రమాల్లో కేవలం ఈ ఇద్దరు అభ్యర్థులే కాకుండా, దీని వెనుక ఒక పెద్ద అంతర్రాష్ట్ర ముఠా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అభ్యర్థులకు డివైస్‌లు సరఫరా చేయడం, బయటి నుంచి ఆన్సర్లు చెప్పడం వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. నిందితుల నుంచి బ్లూటూత్ పరికరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో మెటల్ డిటెక్టర్లు, పటిష్టమైన భద్రత ఉన్నప్పటికీ ఈ పరికరాలు లోపలికి ఎలా వెళ్లాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.                    

ఆ పరికాలతో ఎలా అనుమతించారు?.  ఎందుకు కనిపెట్టలేకపోయారు?           ఈ ఘటనపై హెచ్‌సీయూ అధికారులు తీవ్రంగా స్పందించారు. అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులపై కేసు నమోదు చేయడమే కాకుండా, వారిని భవిష్యత్తులో ఎటువంటి పరీక్షలు రాయకుండా బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. పరీక్ష ప్రక్రియలో ఉన్న లోపాలను సరిదిద్ది, మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించి, దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల కోసం గాలిస్తున్నారు.