నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడలో విషాదం చోటుచేసుకుంది. ఒక ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో విజయ్ అనే వ్యక్తితో పాటు మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే వారు చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. 

Continues below advertisement

ప్రాథమిక సమాచారం ప్రకారం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మంటలు వేగంగా వ్యాపించడంతో వారు ఇంట్లోంచి బయటపడేందుకు అవకాశం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అసలే వేసవికాలం కావడంతో ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం అధికంగా ఉంటుంది. కనుక కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే ప్రమాదాల బారిన పడకుండా ఉంటాం.

ఫ్రిడ్జ్ ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలువోల్టేజ్ స్టెబిలైజర్ వాడాలి: ఫ్రిడ్జ్‌కు ఇన్ బిల్ట్ స్టెబిలైజర్ లేకపోతే, విడిగా ఒక కంపెనీకి చెందిన నాణ్యమైన వోల్టేజ్ స్టెబిలైజర్‌ను తప్పనిసరిగా కొనాలి. ఇది విద్యుత్ హెచ్చుతగ్గుల  నుండి కంప్రెసర్‌ను రక్షిస్తుంది.

Continues below advertisement

వెంటిలేషన్ ఉండాలి: ఫ్రిడ్జ్‌ను ఎప్పుడూ మీరు గోడకు ఆనించి ఉంచకూడదు. గోడకు, ఫ్రిడ్జ్‌కు మధ్య కనీసం 6 నుండి 10 అంగుళాల దూరం పాటిస్తే మంచిది. దీనివల్ల కంప్రెసర్ త్వరగా వేడెక్కకుండా గాలి ఆడుతుంది. తద్వారా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి.

ఎర్తింగ్ చెక్ చేయాలి: మీ ఇంట్లోని విద్యుత్ వైరింగ్‌కు సరైన ఎర్తింగ్ (Earthing) ఉందో లేదో ఎలక్ట్రీషియన్‌తో చెక్ చేయించడం మంచిది. షార్ట్ సర్క్యూట్‌లను నివారించడానికి ఇలా చేయడం అవసరమే. 

ఎక్స్‌టెన్షన్ బోర్డులు వద్దు: ఫ్రిడ్జ్‌ను ఎప్పుడూ ఎక్స్‌టెన్షన్ బోర్డులకు లేదా మల్టీ-ప్లగ్ అడాప్టర్లకు కనెక్ట్ చేయకుండా దానిని నేరుగా గోడకు ఉన్న ప్లగ్ పాయింట్‌కే తగిలించాలి.

 మెకానిక్‌తో చెక్ చేయించాలి: ఫ్రిడ్జ్ వెనుక ఉండే కాయిల్స్‌పై దుమ్ము చేరితే కంప్రెసర్ త్వరగా వేడెక్కి మంటలు రావడానికి అవకాశం ఉంటుంది.

అప్రమత్తత అవసరం: ఫ్రిడ్జ్ నుంచి ఏదైనా ప్లాస్టిక్ కాలుతున్న వాసన వచ్చినా, శబ్దాలు వినిపించినా, లేదా ఫ్రిడ్జ్‌ను తాకినప్పుడు సడన్‌గా షాక్ కొట్టినా వెంటనే ప్లగ్ తీసివేయాలి. మెకానిక్‌ను పిలిచి చెక్ చేయంచాలి. 

ఫ్రిడ్జ్‌ను జాగ్రత్తగా ఎలా వాడాలి?తేమ లేకుండా చూడాలి: రిఫ్రిజిరేటర్ పైన వాటర్ బాటిల్స్ లేదా ద్రవ పదార్థాలు ఉంచకూడదు. పొరపాటున బాటిల్ పడిపోయి లోపల వైరింగ్‌లోకి వెళ్తే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది.

అతిగా నింపవద్దు: ఫ్రిడ్జ్‌లో వస్తువులను నిండా కుక్కవద్దు. లోపల గాలి సరిగ్గా ఆడకపోతే మోటార్‌పై ఒత్తిడి పెరిగి అది వేడెక్కుతుంది.

పాత వైరింగ్ మార్చండి: మీ ఫ్రిడ్జ్ వైరు బాగా పాతగా అయితే లేదా ఎక్కడైనా కట్ అయినా వెంటనే మార్చడం బెంటర్. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో టేపులు వేసి వాడటం మరింత ప్రమాదకరం.

డోర్ సీల్ చెకింగ్: ఫ్రిడ్జ్ తలుపుకున్న రబ్బరు గట్టిగా ఉందో లేదో చెక్ చేయాలి. గాలి బయటకు పోతుంటే ఫ్రిడ్జ్ నిరంతరం రన్ అవుతుంది. ఇలాంటివి ప్రమాదాలకు కారణమవుతాయి.