మేరీల్యాండ్: అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఒక తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. సికింద్రాబాద్‌కు చెందిన 27 ఏళ్ల గొడిశాల నికితా రావు తన మాజీ బాయ్‌ఫ్రెండ్ అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో చనిపోయింది. న్యూ ఇయర్ వేడుకల టైం నుండి ఆమె ఆచూకీ లేకుండా పోయిన క్రమంలో జనవరి 3న పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నికితను మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ(26)నే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Continues below advertisement

నిందితుడే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడా?ఈ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  నికిత కనిపించడం లేదంటూ ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిసెంబరు 31న ఎల్లికాట్ సిటీలోని తన అపార్ట్‌మెంట్‌లో చివరిసారిగా చూశానని  పోలీసులను నమ్మించాలని చూశాడు. చివరకు అతడి అపార్ట్ మెంట్‌లోనే నిఖిత డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. నిఖిత మిస్సింగ్ అని ఫిర్యాదు చేసిన వెంటనే అర్జున్ శర్మ భారత్‌కు పారిపోయాడని పోలీసులకు అనుమానం వచ్చి సెర్చ్ వారెంట్ జారీ చేశారు. డిసెంబరు 31నే నిఖితను అతడు హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

నికిత చదువులో మేటి. టాలెంటెడ్ స్టూడెంట్ గా ఉండేది. ఆమె జేఎన్‌టీయూ (JNTU)లో ఫార్మసీ పూర్తి చేసి, భారత్‌లోని ఒక  ఆసుపత్రిలో మూడేళ్లు సేవలు అందించింది. అనంతరం మాస్టర్స్ చేసేందుకు అమెరికాకు వెళ్లిన ఆమె, ప్రస్తుతం మేరీల్యాండ్‌లోని వెడా హెల్త్ కంపెనీలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా చేస్తున్నట్లు సమాచారం. అత్యుత్తమ పనితీరుకు గానూ గతేడాది నిఖిత 'ఆల్-ఇన్ అవార్డు'ను దక్కించుకున్నారు. ఎంతో ప్రతిభావంతురాలైన నిఖిత మాస్టర్స్ చేసేందుకు వెళ్లి హత్యకు గురైందని తెలియగానే కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె హత్యకు గురికావడాన్ని తోటి ఉద్యోగులు, స్నేహితులు సైతం నమ్మకలేకపోతున్నారు. 

Continues below advertisement

నిఖిత హత్య ఘటనపై అమెరికాలోని భారత ఎంబసీ స్పందించింది. నికిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పింది.  భారత్‌కు పరారైన నిందితుడు అర్జున్ శర్మను పట్టుకునేందుకు స్థానిక పోలీసులు ఫెడరల్ అధికారుల సాయం కోరుతున్నారు. నిందితుడిని తిరిగి అమెరికాకు తీసుకువచ్చి చట్టపరమైన చర్యలు తీసుకునేలా భారత అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు.