హైదరాబాద్: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక దీపం అంటుకుని యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముంటున్న 18 ఏళ్ల సాయి వెంకట సింధు అనే యువతి మంటల్లో చిక్కుకుని చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందడంతో విషాదం నెలకొంది. 

Continues below advertisement

కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ యువతి విషాదకరంగా మృతి చెందింది. అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముంటున్న 18 ఏళ్ల సాయి వెంకట సింధు ప్రాణాలు కోల్పోయింది. ఆమె రోడ్ నంబర్ 5లో ఎస్ఎస్ బొటీక్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 12న రాత్రి సింధు తన షాప్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఇంటి గేటు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. గేటు వద్ద వెలిగించిన కార్తీక దీపం అనుకోకుండా ఆమె చీరకు అంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో సింధు తీవ్రంగా గాయపడింది.

దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సింధు ప్రాణాలు కోల్పోయింది. యువతి మృతితో అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Continues below advertisement