Student Missing: అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో గల్లంతైన వారిలో మరో రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. గల్లంతైన వారిలో ఇప్పటి వరకు మూడు మృతదేహాలు లభ్యమైన అధికారులు తెలిపారు. అలాగే మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 2 హెలికాప్టర్లు, 4 బోట్ల ద్వారా విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. నిన్న పూడి మడక బీచ్ క్ వచ్చిన 15 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఆరుగులు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరంతా అనకాపల్లిలోని డీఐఈటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు గల్లంతు అయిన వారిలో పవన్ సూర్య కుమార్, గణేష్, జగదీషన్ మృతదేహాలు లభ్యం అయ్యాయి. జశ్వంత్, రామచందు, సతీష్ ల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


అనకాపల్లి జిల్లా పూడి మడక సుముద్ర తీరంలో విద్యార్థుల అన్వేషణ్ కొనసాగుతోంది. శుక్రవారం డైట్ కళాశాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు 12 మంది పరీక్షలు ముగిసిన తర్వాత విహారం కోసం పూడిమడక బీచ్ కు వచ్చారు. 12 మందిలో ఒకరు ఒడ్డు మీదే ఉండగా... 11 మంది స్నానాల కోసం సముద్రంలోకి దిగారు. కాసేపటికి లోపలికి దిగిన విద్యార్థుల పైకి ఆ పెద్ద అల వచ్చింది. దీంతో వారు లోపలికి వెళ్లారు. కాసేపటికే ఐదుగురు తీరానికి కొట్టుకు వచ్చారు. ఏడుగురు మాత్రం బయటకి రాలేకపోయారు. 


స్థానికులే ఇద్దరిని కాపాడారు..


ఒడ్డుమీద ఉన్న విద్యార్థితో పాటు బయటకు వచ్చిన వారు అరవడంతో.. స్థానికులు, మత్స్యకారులు రంగంలోకి దిగారు. దగ్గరగా ఉన్న మరో ఇద్దరు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. వారిలో నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లికి చెందిన గుడివాడ పన్ సూర్య కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థిని అనకాపల్లి జిల్లా మునగపాకలు చెంది సూరిషెట్టి తేజను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గల్లంతైన వారిలో విశాఖ గోపాల పట్నానికి చెందిన కంపర జగదీష్, గుంటూరుకు చెందిన బయ్యపునేని సతీష్ కుమార్, అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందిన జశ్వంత్ కుమార్, ఇదే మండలం చూచుకొండకు చెందిన పెంటకోట గణేష్, ఎలమంచిలికి చెందిన పూడి రామచందు ఉన్నారు. 


స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీ ఆ ప్రాంతానికి వచ్చి గాలింపను పర్యవేక్షించారు. మంత్రి అమర్నాథ్ కూడా వచ్చారు. విద్యార్థుల ఆచూకీ కోసం సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తున్నామన్నారు. చీకటి పడడం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కల్గిందని చెప్పారు. ఉదయం నుంచి నేవీ, మెరైన్ అధికారులతో పాటు స్థానిక మత్స్యకారుల సాయంతో మరింతగా గాలింపు చేపడుతామన్నారు. సముద్ర తీరంలో జరిగిన విషాధ ఘటనపై సీఎం ఆరా తీశారు. విద్యార్థుల గల్లంతుపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.