Tamilnadu Raj Bhavan:


రాజ్‌భవన్‌పై దాడి..


తమిళనాడు రాజ్‌భవన్‌ గేటుపై ఓ దుండగుడు పెట్రోల్ బాంబులు విసిరిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. గవర్నర్ RN రవి (Governor RN Ravi) అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌పై ఇలా దాడి జరగడం వల్ల భద్రతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం (అక్టోబర్ 25) 2.45 గంటలకు ఈ దాడి జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడి పేరు కరుకా వినోద్‌గా గుర్తించారు. రెండు పెట్రోల్ బాంబులను రాజ్‌భవన్ మెయిన్‌ గేట్‌పై విసిరినట్టు తెలిపారు. ఓ కోర్టు ఆవరణలో పార్క్ చేసి ఉన్న బైక్‌ల నుంచి పెట్రోల్ దొంగిలించాడు నిందితుడు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఓ బాటిల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి గేట్‌పైకి విసిరాడు. ఆ తరవాత మరో బాటిలి విసిరాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడుని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 


 






ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై స్పందించారు. గవర్నర్‌ నివాసంపైనే దాడి చేస్తున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు అంటూ మండి పడ్డారు. DMK ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తోందని, ఈ దాడులు చేయించింది ఆ పార్టీయే అన్న అనుమానాలున్నాయని అన్నారు. నేరస్థులు ఇలా నడిరోడ్డుపై తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అయితే...ఈ నిందితుడే 2022 ఫిబ్రవరిలో తమిళనాడు హెడ్‌క్వార్టర్స్‌పైనా దాడి చేశాడు. అందుకే...డీఎమ్‌కే కావాలనే ఈ దాడులు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు అన్నమలై.