Hyderabad Woman Pilot Complaint:   భాగ్యనగరంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని చట్టాలు వస్తున్నా, కామాంధుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం వెళ్లే జిమ్ కేంద్రాలు కాస్తా.. వికృత చేష్టలకు, లైంగిక వేధింపులకు అడ్డాలుగా మారుతున్నాయనే చేదు నిజం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్‌లోని సనత్ నగర్ పరిధిలో ఉన్న  కల్ట్ (Cult) జిమ్‌లో ఫిట్‌నెస్ మేనేజర్‌గా పనిచేస్తున్న సంతోష్ గౌడ్ అనే వ్యక్తి.. జిమ్‌కు వస్తున్న ఒక మహిళా పైలట్‌ను  తీవ్రంగా లైంగిక వేధింపులకు గురిచేసిన  సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఈ వికృత మేనేజర్ లీలలను బయటకు తీశారు.

Continues below advertisement

బాధితురాలు పైలట్ కావడంతో ఆమె షెడ్యూల్స్ చాలా బిజీగా ఉండేవి. దీనిని ఆసరాగా చేసుకుని, జిమ్ ట్రైనింగ్ పేరుతో సంతోష్ గౌడ్ ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నించాడు. క్రమంగా తన అసలు స్వరూపాన్ని బయటపెడుతూ.. ఒక రాత్రి తనతో గడపాలంటూ సదరు మహిళా పైలట్‌పై తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాడు. అయితే, ఈ దారుణమైన వేధింపుల వెనుక సంతోష్ గౌడ్ ఒక్కడే లేడు.. అతడికి పూర్తిస్థాయిలో సహకరించిన మరొక మహిళ, అతడి ప్రియురాలు రజినీ కూడా ఈ కుట్రలో భాగస్వామి కావడం ఇక్కడ అత్యంత షాకింగ్ అంశం.                     తన ప్రియురాలితో పాటు సదరు మహిళా పైలట్‌తోనూ ఒకేసారి ప్రైవేటుగా కలిసి ఉండాలనేది సంతోష్ గౌడ్ యొక్క వికృతమైన  ఫాంటసీ . ఇందుకోసం అతడి గర్ల్ ఫ్రెండ్ రజినీ స్వయంగా ఆ పైలట్‌ను ఒప్పించేందుకు రాయబారాలు నడిపారు.  మగవాడు మృగంలా మారితే అడ్డుకోవాల్సిన ఒక మహిళ.. ప్రియుడి వికృత కోరికల కోసం మరో మహిళను వేధించడానికి సిద్ధపడటం సమాజం తలదించుకునేలా చేస్తోంది. వీరిద్దరూ కలిసి ఎంత ఒత్తిడి తెచ్చినా సదరు పైలట్ వారి అనాగరిక, అక్రమ కోరికలకు ఏమాత్రం లొంగలేదు. దీంతో తీవ్రమైన ఈగో ఫీల్ అయిన మేనేజర్ సంతోష్ గౌడ్.. ఆమెను మానసికంగా దెబ్బతీయాలని డిసైడ్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్  వేదికగా బాధితురాలికి అత్యంత అసభ్యకరమైన, అశ్లీల సందేశాలు  పంపుతూ, నిత్యం వేధించడం మొదలుపెట్టాడు.                    

ఇలా రోజురోజుకూ మితిమీరిపోతున్న ఈ వికృత జంట వేధింపులను భరించలేకపోయిన సదరు ధైర్యవంతురాలైన పైలట్, చివరకు పోలీసులను ఆశ్రయించింది. సంతోష్ గౌడ్, రజినీలు తనకు పంపిన అశ్లీల సందేశాలు, ఆడియో రికార్డులను పక్కా సాక్ష్యాలుగా పోలీసులకు సమర్పించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సనత్ నగర్ పోలీసులు సంతోష్ గౌడ్‌తో పాటు అతడి గర్ల్ ఫ్రెండ్‌పై ఐటీ యాక్ట్, మహిళలపై వేధింపుల నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.                      

Continues below advertisement