కడప: రాయచోటి- కడప రహదారిలో శనివారం మరో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్లోనే మృతిచెందారు. కడప గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘాట్ రోడ్డులో వెళ్తున్న కారుపై ఓ లారీ పడిపోయింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు. కారులో ఇరుక్కుపోయి ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి మృతిచెందారు. రాయచోటి నుండి కడపకు వెళ్లున్న సమయంలో గువ్వల చెరువు రెండవ ఘాటులో ఈ ప్రమాదం జరిగింది. భారీ లోడ్‌తో వెళ్తున్న లారీ బ్యాలెన్స్ కంట్రోల్ కాక.. ఒక్కసారిగా కారుపై ఒరిగి పడిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను స్థానికుల సహాయంతో వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నారు. 

కర్ణాటక కు సంబందించిన కార్ లో ప్రయాణిస్తున్న ఏడు మంది కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నారు. వారిని బద్వేల్ వాసులుగా గుర్తించారు. నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒక పురుషుడు, మహిళా, ఇద్దరు  పిల్లలు ఉన్నారు. తీవ్ర గాయలతో బయటపడ్డ ఇద్దరు మహిళలను మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రి కి తరలించారు పోలీసులు. 4 ఏళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. 

మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి

కడప జిల్లా సీకే దిన్నె మండల గువ్వలచెరువు ఘాట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందడంపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రాయచోటి నుంచి కడపకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం అన్నారు. ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మహిళలు మరణించడం కలచివేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు.

...