Rajasthan official bribery: క్విడ్ ప్రో కో గురించి మనం చాలా సార్లు విన్నాం. కానీ అది రాజకీయ నేతలకు సంబంధించినది. ఈ క్విడ్ ప్రో కో అధికారి చేసింది. రాజకీయ నేతలు పెట్టుబడుల రూపంలో లంచాలు తీసుకుంటే. ఇక్కడ మాత్రం జీతం రూపంలో లంచం తీసుకున్నారు.
రాజస్థాన్ ప్రభుత్వ ఐటీ విభాగం రాజ్‌కాంప్ ఇన్ఫో సర్వీసెస్ లిమిటెడ్ (RISL)లో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రద్యుమ్న్ దీక్షిత్ వినూత్న రీతిలో అవినీతికి పాల్పడ్డాడు. రెండు ప్రైవేట్ కంపెనీలకు టెండర్లు ఇచ్చేందుకు తన భార్యను 'కన్సల్టెంట్'గా నియమించమని షరతు పెట్టుకుని, ఆమెకు 2019 ఏప్రిల్ నుంచి ప్రతి నెల 1.60 లక్షల రూపాయలు 'సాలరీ'గా చెల్లించించేలా ఒప్పందం చేసుకున్నాడు. ఆమె ఒక్కసారి కూడా ఆఫీసుకు రాలేదు, అయినా మొత్తం రూ. 50 లక్షలకు పైగా డబ్బు చెల్లించారు.
యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB) దర్యాప్తులో ఈ లంచం వ్యవహారం బయట పడింది. ఈ 'క్రియేటివ్ కరప్షన్' పై ఇప్పుడు రాజస్థాన్ లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాజ్‌కాంప్ (RISL) రాజస్థాన్ ప్రభుత్వ ఐటీ & కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ (DOIT) కింద ..ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న IT కన్సల్టింగ్ కంపెనీ. ప్రద్యుమ్న్ దీక్షిత్ ఇక్కడ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ, ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ టెండర్లు కేటాయించే విధుల్ని నిర్వహించేవారు. ప్రైవేట్ కంపెనీ 'ఓరియన్‌ప్రో'కు టెండర్ ఇచ్చే సమయంలో తన భార్య పూనంను RISLలో 'కన్సల్టెంట్'గా నియమించమని షరతు పెట్టాడు. మరో కంపెనీ 'ట్రిజిన్ సాఫ్ట్‌వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్' నుంచి కూడా 'ఈ-కనెక్టర్' ఎంటిటీ ద్వారా కాంట్రాక్ట్ ఇచ్చి, లంచంగా డబ్బు తీసుకున్నాడుట.
2019 ఏప్రిల్ నుంచి పూనాను RISLలో 'జాబ్' ఇచ్చి, సాలరీ బిల్లులపై సంతకం చేస్తూ, ఆమె అటెండెన్స్‌ను తాను గుర్తించాడు. ఆమె ఒక్కసారి కూడా ఆఫీసుకు రాలేదు. ప్రతి నెల ₹1.60 లక్షలు పూనా బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ అయ్యాయి. 2017-2019 మధ్య 15 ఇన్‌స్టాల్‌మెంట్లలో ప్రతి సారి రూ.25,000 చొప్పున మొత్తం రూ. 50 లక్షలకు పైగా డబ్బు వచ్చింది. ప్రద్యుమ్న్ తన కుటుంబాన్ని 'బిజినెస్'లా నడిపించి, పబ్లిక్ మనీని అక్రమంగా కొల్లగొట్టాడని ACB ఆరోపణలు చేసి కేసు పెటటింది.
RISL డెప్యూటీ డైరెక్టర్ రాకేష్ కుమార్‌తో పాటు ప్రద్యుమ్న్, పూనా మీద టీ.ఎన్. శర్మ అనే వ్యక్తి ACBకు రాతపూర్వక ఫిర్యాదు చేశాడు. ఈ కంప్లైంట్‌లో కరప్షన్, ఫేక్ అపాయింట్‌మెంట్ వివరాలు ఉన్నాయి. కంప్లైంట్ మేరకు ACB కేసు నమోదు చేసి, పూనా బ్యాంక్ అకౌంట్ రికార్డులు సీజ్ చేసింది. ట్రాన్సాక్షన్లు, టెండర్ డాక్యుమెంట్లు, అటెండెన్స్ రికార్డులు పరిశీలించగా మోసం బయటపడింది.