Raipr DSP Kalpana Verma  WhatsApp chats Viral:   ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఓ బిజినెస్‌మెన్ దంపతులు మహిళా పోలీస్ అధికారిపై షాకింగ్ ఆరోపణలు చేశారు. దాంతేవాడా జిల్లాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ (DSP)గా పనిచేస్తున్న కల్పనా వర్మ.. ప్రేమలో పడేసి, బ్లాక్‌మెయిల్ చేసి రూ.2.5 కోట్లకు పైగా దోచేసిందని వ్యాపారి దీపక్ టాండన్, ఆయన భార్య బర్ఖా టాండన్ ఫిర్యాదు చేశారు.

Continues below advertisement

2021లో ఓ సామాజిక కార్యక్రమంలో దీపక్‌కు కల్పనా వర్మ పరిచయమైంది. స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. దీపక్ భార్యకు కూడా విషయం తెలిసి విడాకుల  వరకూ వెళ్లింది. కానీ డీఎస్పీ ప్రేమ పేరుతో డబ్బు, బహుమతులు, ఆస్తులు కాజేస్తూ వచ్చిందని ఆ దంపతులు ఆరోపించారు.  రూ.2 కోట్ల పైగా నగదు,  రూ.12 లక్షల డైమండ్ రింగ్,  రూ.5 లక్షల బంగారు గొలుసు, బ్రేస్‌లెట్,  ఇన్నోవా క్రిస్టా కారు,  రాయ్‌పూర్ VIP రోడ్డులోని హోటల్‌లో రూ.50 లక్షల పెట్టుబడి,  ఆ హోటల్ ఆస్తిని తన సోదరుడి పేరు మీద రాయమని ఒత్తిడి చేస్తున్నారని ఆ దంపతులు ఆరోపించారు  

దీపక్ మీడియాకు చూపించిన వాట్సాప్ చాట్స్, ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డబ్బు అడిగిన మెసేజీలు, రింగ్ పట్టుకున్న ఫొటోలు, ఇద్దరూ కలిసి తిరిగిన వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.             

DSP కల్పనా వర్మ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు.  ఇవన్నీ నిరాధారమైన అబద్ధాలు.. రాజకీయ కుట్ర. దీపక్‌ తో తనకు అంత గొప్ప పరిచయం లేదన్నారు.  చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.  వ్యాపారి దంపతుల ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మోసం 420, బెదిరింపు506 వంటి సెక్షన్లు పెట్టారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి బ్యాంక్ లావాదేవీలు, చాట్స్, ఆస్తి పత్రాలు పరిశీలిస్తోంది. ఈ కేసు ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖలోనే పెద్ద చర్చగా మారింది.