Siya Goyal Murder Plan Reason:  మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే బిజినెస్‌మెన్ కేతన్ అగర్వాల్ హత్య ఉదంతం, ప్రేమ-పగ-పరువు అనే మూడు కోణాల చుట్టూ తిరుగుతూ ఒక క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కేవలం  పెళ్లి ఇష్టం లేదు  అని చెబితే సరిపోయే దానికి, సియా గోయల్ ఏకంగా అంతపెద్ద మర్డర్ ప్లాన్ ఎందుకు వేసింది? దొరికిపోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని తెలియదా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వేధిస్తున్నాయి.   పుణే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో వెల్లడైన సమాచారం ప్రకారం.. ఈ మిస్టరీ వెనుక సమాజానికి కనిపించని ఒక పెద్ద మైండ్ గేమ్, పరువు ప్రతిష్ఠల భయం దాగి ఉన్నాయి.

Continues below advertisement

తల్లిదండ్రుల ఒత్తిడితో పెళ్లికి అంగీకరించిన సియాగోయల్  

సియా గోయల్ నేరుగా పెళ్లి వద్దని చెప్పకపోవడానికి ప్రధాన కారణం  కుటుంబాల మధ్య ఉన్న వ్యాపార బంధాలు , సామాజిక పరువు . వారిద్దరిదీ ఉన్నత శ్రేణి బిజినెస్ క్లాస్ కుటుంబాలు. ఇప్పటికే ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి నిశ్చయించి, సమాజంలో  అనౌన్స్ చేశారు. సియాకు ఈ పెళ్లి ఇష్టం లేదని నేరుగా చెబితే తన తల్లిదండ్రుల పరువు పోతుందని, అలాగే ఇరు కుటుంబాల మధ్య ఉన్న కోట్ల రూపాయల బిజినెస్ డీల్స్ దెబ్బతింటాయని ఆమె భయపడింది. తానే స్వయంగా పెళ్లి నిరాకరిస్తే సమాజం తనను తప్పుబడుతుందని భావించిన సియా, కేతన్ అగర్వాల్‌ను పూర్తిగా లైఫ్ నుంచి తొలగిస్తే.. అటు పెళ్లి తప్పుతుంది, ఇటు ఒక ప్రమాదంగానో లేదా సహజ మరణంగానో చిత్రీకరిస్తే ఎవరికీ అనుమానం రాదనే వికృత ఆలోచనకు తెరలేపింది.

Continues below advertisement

ప్లాన్ ప్రకారమే కేతన్ అంటే ఇష్టం ఉన్నట్లుగా సియా ప్రవర్తన 

ఇక పెళ్లి ఇష్టం లేకపోయినా సియా గోయల్, కేతన్ అగర్వాల్‌తో కలిసి పార్టీలు చేసుకోవడం, డేటింగ్‌లకు వెళ్లడం వెనుక ఆమె వేసిన పక్కా క్రైమ్ మాస్టర్ ప్లాన్ ఉంది. కేతన్ మనసులో తనపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలనేదే ఆమె వ్యూహం. తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నామని కేతన్‌కు, అతని కుటుంబానికి నమ్మకం కలిగిస్తే.. భవిష్యత్తులో కేతన్‌కు ఏదైనా జరిగినా తనపై ఎవరూ నిందలు వేయరని సియా భావించింది. ఈ పార్టీల నెపంతోనే ఆమె కేతన్   రోజువారీ అలవాట్లు, అతని వీక్‌నెస్, అతను ఎక్కడికి వెళ్తాడు వంటి పూర్తి సమాచారాన్ని సేకరించింది. ఒక రకంగా చెప్పాలంటే, కేతన్‌ను చంపడానికి వేసిన వ్యూహంలో ఈ విలాసవంతమైన పార్టీలు ఆమెకు ఒక  కవర్ స్టోరీ గా ఉపయోగపడ్డాయి.

సియా తల్లిదండ్రులకు తెలుసా?

ఈ దారుణమైన మర్డర్ ప్లాన్ వెనుక సియా తల్లిదండ్రుల పాత్ర ఉందా? వారికి ఈ విషయం ముందే తెలుసా? అనే కోణంలో అనుమానాలు వచ్చాయి.  పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. కేతన్‌ను చంపాలనే ప్లాన్ సియాకు మాత్రమే తెలుసు. అయితే, తన కూతురు ఈ పెళ్లితో సంతోషంగా లేదనే విషయం తల్లిదండ్రులకు కొంతవరకు తెలుసు కానీ, ఆమె ఇంతటి ఘాతుకానికి ఒడిగడుతుందని వారు ఊహించలేదు. కానీ, కూతురి మానసిక స్థితిపై తల్లిదండ్రులకు అవగాహన ఉందని, అయితే కుటుంబ పరువు కోసం వారు కూడా పెళ్లి విషయంలో ఆమెను ఒత్తిడి చేశారని సమాచారం. ఏది ఏమైనప్పటికీ, సియా చేసిన ఈ దారుణంతో ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రెండు కుటుంబాల పరిస్థితి ఘోరం

"దొరికిపోతే పరువు పోతుంది.. కుటుంబం అంతా జైలు పాలవుతుంది" అనే కనీస జ్ఞానాన్ని సియా  అహంకారం, అతితెలివి పూర్తిగా కప్పేసాయి. పక్కాగా ప్లాన్ చేస్తే పోలీసులు తనను పట్టుకోలేరని, టెక్నాలజీ యుగంలో డిజిటల్ ఆధారాలు దొరకకుండా మేనేజ్ చేయవచ్చని ఆమె అతిగా నమ్మింది. కానీ, నేరం ఎప్పటికీ దాగదు  అనే సూత్రం ప్రకారం పుణే పోలీసులు విచారణలో సియా కాల్ డేటా, చాట్స్,  పరారీలో ఉన్న  నిందితులతో ఆమె జరిపిన లావాదేవీలను బట్టబయలు చేశారు. పరువు కోసం ప్రాణాలు తీయాలనుకున్న ఒక యువతి, చివరకు తన చేతులతోనే తన కుటుంబ పరువును బజారున పడేసి కటకటాల పాలైంది. ఈ కేసు ప్రస్తుతం మహారాష్ట్రలో హై ప్రొఫైల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌గా సాగుతోంది.