Prakash Raj Responds About Case: బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో ప్రకాష్ రాజ్ పై కూడా కేసు నమోదు అయింది. ఈ కేసు గురంచి తెలియడంతో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. తాను 9 ఏళ్ల కిందట ఓ బెట్టింగ్ యాప్ కు యాడ్ చేశానన్నారు. అయితే తర్వాత అతి తప్పని తేలడంతో ఇక ఎక్స్ టెండ్ చేయలేదన్నారు. ఆ తర్వాత మరి ఏ  బెట్టింగ్ యాప్‌కు కూడా ప్రమోషన్ చేయలేదన్నారు. తాను చేసిన ప్రమోషన్ గడువు ముగిసిపోయిందని ఇంకెక్కడైనా వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ కంపెనీకి కూడా చెప్పాన్నారు. పోలీసుల నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని వస్తే అదే చెబుతానన్నారు. అయితే ప్రజలకూ చెప్పాల్సి ఉందని అందుకే..తాను వీడియో రిలీజ్ చేస్తున్నాన్నారు.  






బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయడాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎవరు ప్రమోట్ చేసినట్లుగా వీడియోలు ఉన్నా వదిలి పెట్టడంలేదు. పదకొండు మంది టీవీ, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లపై కేసులు పెట్టారు. తాజాగా  మియాపుర్  పోలీస్ స్టేషన్ ‌లో  రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, అనన్య నాగళ్ల, ప్రణీత వంటి  వాటిపై కేసులు పెట్టారు.  సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లుగా .. టీవీ తెరపై సెలబ్రిటీలుగ ాఉన్న శోభాశెట్టి, సిరి హనుమంతు, నయని పావని, శ్రీముఖి, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, యూట్యూబర్ వర్షిణి, వసంత కృష్ణ, అమృత చౌదరి, ఇమ్రాన్ ఖాన్  సహా మొత్తం 25 మంది నటీనటులపై ఈ కేసులు పెట్టారు.  వీరికి పోలీసులు నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తున్నారు.                                    
  
టేస్టీ తేజ, యాంకర్ విష్ణుప్రియ సహా పలువురు విచారణకి కూడా హాజరయ్యారు. విష్ణు ప్రియ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. పలు కీలక విషయాలను విష్ణు ప్రియ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్క ప్రమోషనల్ వీడియోకు లక్షకుపైగా తీసుకుని ఈ పని చేసినట్లుగా భావిస్తున్నారు.  పోలీసులు కేసులు పెడుతూండటంతో చాలా మమంది సెలబ్రిటీలు పాత వీడియోలు డిలీట్ చేస్తున్నారు.  బెట్టింగ్ యాప్స్‌ని దయచేసి వాడొద్దని, అలానే ప్రమోట్ చేయొద్దంటూ కోరారు. గతంలో తాము ప్రమోట్ చేసినందుకు చింతిస్తున్నామని.. తెలిసో తెలియకో చేసిన తప్పుని క్షమించాలని వీడియోలు పెడుతున్నారు.                    


ఈ బెట్టింగ్ యాప్స్  దేనికీ అనుమతులు లేకపోవడం .. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌లు కావడం వల్లనే కేసులు పెడుతున్నారు. లీగల్ అయితే సెలబ్రిటీలు తప్పించుకోవచ్చు. తాను లీగల్ గా అన్ని అనుముతులు ఉన్న కంపెనీకే ప్రమోట్ చేశానని విజయ్ దేవరకొండ చెబుతున్నారు.