Gandikota girl murder case: గండికోటలో హత్యకు గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని కేసులో అసలు నిందితులు ఎవరు.. హంతకులు ఎవరు అన్నదానిపై పోలీసులు క్లూలెస్‌గా మారారు. ఆ విద్యార్థిని ప్రియుడు చంపలేదని మాత్రం నిర్దారణకు వచ్చారు. ఎవరు చంపారన్నది మాత్రం గుర్తించలేకపోతున్నారు. ప్రియుడు లోకేష్ ఆ అమ్మాయిని గండికోటకు తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లకు తెలియడంతో వారు వస్తున్నారని ఆ అమ్మాయిని అక్కడే విదలి పెట్టిపోయారు. తర్వాత రోజు హత్యకు గురయింది. ఈ మధ్యలో ఏం జరిగింది.. ఆ అమ్మాయి కుటంబసభ్యులు అక్కడకు వచ్చారా లేదా అన్నది తెలియడం లేదు. అదే సమయంలో బయట ఎక్కడో హత్య చేసి తీసుకచ్చి అక్కడ పడేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పరువు హత్య కోణంలోనే దర్యాప్తు
ప్రధానంగా పరువు హత్య కోణంలోనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాలిక సోదరులైన బ్రహ్మయ్య, కొండయ్యలపై ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టారు. బాలిక తన ప్రియుడు లోకేష్‌తో ప్రేమ వ్యవహారం కలిగి ఉండటం వల్ల కుటుంబ పరువు దెబ్బతింటుందనే ఉద్దేశంతో వీరు ఈ ఘాతుకానికి పాల్పినట్లుగా అనుమానిసతున్నారు. వీరిద్దరినీ వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రియుడు లోకేష్ బాలికను గండికోటకు తీసుకెళ్లినందున లోకేష్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజీ, పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా అతని పని కాదని గుర్తించారు. బాలికపై లైంగిక దాడి కూడా జరగలేదు.
బాలిక ఇద్దరు సోదరుల్ని ప్రశ్నిస్తున్న పోలీసులు
లోకేష్ బాలికతో కలిసి సోమవారం (జులై 14) ఉదయం 8:10 గంటలకు గండికోటకు వచ్చాడు, కానీ ఉదయం 10:45 గంటలకు ఒంటరిగా వెళ్లిపోాడు. బాలిక ఉదయం 11 గంటల సమయంలో రంగనాథస్వామి ఆలయం సమీపంలో కళాశాల బ్యాగ్‌తో నడుస్తూ కనిపించింది. ఆమె హత్య బహుశా మధ్యాహ్నం 12 నుండి 1 గంటల మధ్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అయితే కుటుంబసభ్యులు బాలిక సోదరులు ఈ హత్య చేయలేదని అంటున్నారు. లోకేషే తమ బిడ్డను చంపారని.. ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
టెక్నికల్ ఆధారాలతో పరిశోధన చేస్తున్న పోలీసులు
జులై 15, 2025 ఉదయం 6:30 గంటలకు మధవరాయస్వామి ఆలయం వెనుక పొదలలో మృతదేహం బయటపడింది. జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర రావు, కడప ఎస్పీ ఇ.జి. అశోక్ కుమార్, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లను ఉపయోగించి ఆధారాలు సేకరించారు. సెల్‌ఫోన్ టవర్ డంప్ డేటా, సీసీటీవీ ఫుటేజీ వంటి సాంకేతిక సాధనాలతో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
కడప జిల్లాలో ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది. లైంగిక దాడి జరగకుండా.. బాలికను హత్య చేయడం అంటే.. ఖచ్చితంగా ఇతర కారణాలోతనే చేసి ఉంటారని గట్టి నమ్మకానికి వచ్చారు. ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో అసలు విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.