Crime News : విజయవాడలో మరోసారి కాల్ మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టీడీసీ కార్పోరేటర్ కుమారుడు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని.. కాల్ మనీ కింద డబ్బులు అప్పు ఇచ్చి పీడిస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. తమను అధిక వడ్డీల పేరుతో వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది కూడా టీడీపీ కార్యకర్తలేనని పోలీసులు చెబుతున్నారు. విజయవాడ కార్పోరేషన్ పరిదిలోని 61వ డివిజన్ కు టీడీపీ కార్పొరేటర్ దుర్గ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కుమారుడు ధనశేఖర్ వడ్డీ వ్యాపారం చేస్తూంటారు. కాల్ మనీ పేరుతో అధిక వడ్డీ వసూలు చేస్తున్నాడన్న ఫిర్యాదులు రావడంతో పోలీసులు 386, 509, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహరం పై నున్న పోలీసులు విచారణ చేపట్టారు.
వడ్డీ వ్యాపారం చేస్తున్న టీడీపీ కార్పొరేటర్ కుమారుడు
కార్పొరేటర్ కుమారుడు ఫణి కుమార్ అనే వ్యక్తికి రూ.50 వేలు ఇచ్చి. రెండున్నర లక్షలు వసూలు చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ తరువాత కూడా వేదింపులను కంటిన్యూ చేశారు. బాధితుడు ఫణి కుమార్ భార్యను ధన శేఖర్ వేదించినట్లుగా ఫిర్యాదు రావటంతో పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. కాల్ మని...ఈ పేరు చెబితేనే ముందుగా గుర్తుకు వచ్చేది బెజవాడ...కాల్ మని కోసం దారుణాలకు ఒడికట్టిన ఘటనలు అనేకం వెలుగు లోకి వచ్చాయి.అప్పులు ఇచ్చి దాని పై వడ్డీలతో పాటుగా చక్రవడ్డీలు వసూలు చేయటంతో పాటుగా బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకొని మహిళల పై లైంగిక వేదింపులకు పాల్పడిన ఘటనలు అనేక వెలుగు లోకి వచ్చాయి.
అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తున్నారని ఫిర్యాదు
కాల్ మనీ వ్యవహరాలు పై గతంలో విజయవాడ పోలీస్ కమీషనర్ గా పని చేసిన గౌతం సవాంగ్ ప్రత్యేక విచారణ బృందాలను ఏర్పాటు చేశారు. పోలీస్ కమీషనరేట్ లోనే ప్రత్యేక ఫిర్యాదు విభాగం కూడా ఏర్పాటు చేశారు. దీంతో అనేక మంది బాదితులు వచ్చి తమ ఆవేదనను, జరిగిన నష్టాన్ని వివరించారు. ఈ ఘటన విజయవాడలో తీవ్ర స్దాయిలో సంచలనం రేకెత్తించింది. విజయవాడలో జరిగిన ఘటనలతో కాల్ మని వ్యాపారుల పై రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాల్ మనీకి డబ్బులు ఇచ్చి వేధింపులకు గురి చేసిన వారి పై పోలీసులు కేసులు నమోదు చేయటం తీవ్ర స్దాయిలో సంచలనంగా మారింది.
గతంలో టీడీపీ నేతలపై కాల్ మనీ కేసులు..
గతంలో టీడీపీ అదికారంలో ఉండగానే కాల్ మనికి సంబందించిన అరాచకాలు వెలుగులోకి వచ్చాయి.విజయవాడ సీపీగా పని చేసిన సమయంలో గౌతం సవాంగ్ కాల్ మని కాల్ నాగులను వెలుగు లోకి తీసుకువచ్చి వారి ఆగడాలకు చెక్ పెట్టారు. దీంతో చాలా మంది అసలు వడ్డీ వ్యాపారం చేయటమే మానేశారు. అప్పులు దొరక్క చాలా మంది అవస్దలు కూడ పడ్డారు.టీడీపీ అదికారంలో ఉండగానే కాల్ మని వ్యవహరంలో టీడీపీ పార్టికి చెందిన నాయకుల పేర్లే బయటకు రావటంతో పోలీసులు వారి పై కేసులు కూడ పెట్టారు.ఇప్పుడు కూడ టీడీపీకి చెందిన కార్పొరేటర్ కుమారుడు కాల్ మని వ్యవహరంలో అరెస్ట్ కావటం సంచలనం గా మారింది.