Psycho Killer Rambabu: ఎన్నెన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు. కట్టుకున్న దాన్ని చాలా ప్రేమగా చూస్కుంటూ.. ఓ కుమారుడు, కుమార్తెతో కలిసి ఉన్నంతలో జీవితాన్ని హాయిగా గడిపాడు. కానీ తప్పుడుతోవ పట్టిన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెల్సిన భర్త.. ఆమెపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకున్నాడు. 20 ఏళ్ల వయసు దాటిన పిల్లలను ముందు పెట్టుకొని ఇలా చేయడం తప్పని చెప్పాడు. ఆమె వినకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అయితే అతడు ఆమెపై విపరీతమైన కోపాన్ని పెంచుకున్నాడు. 


ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు..!


కేవలం ఆమెపైనే కాదండోయ్.. ఆడ జాతి మొత్తం మీద. అప్పటి నుంచి ఆడది కనిపిస్తే చాలు కోపంతో రగిలిపోయేవాడు. వాళ్లను చంపాలన్నా ఉద్వేగంత ఊగిపోయేవాడు. ఎలాగైనా సరే ఆడ జాతిని అంతం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే కనిపించిన స్త్రీనల్లా చంపేందుకు కుట్ర పన్నాడు. వరుస హత్యలకు కూడా పాల్పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.  


కనిపించిన స్త్రీనల్లా చంపేందుకు యత్నం..!


అనకాపల్లి జిల్లా కోటవురట్లకు చెందిన రాంబాబుకు ఓ భార్య ఉంది. అయితే 2018లో రాంబాబు భార్య వేరే వ్యక్తితో ఆక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న అతడు తట్టుకోలేకపోయాడు. అలాగే రియల్ ఎస్టేట్ లో రాంబాబు ఏజెంట్ గా పని చేస్తున్న సమయంలో.. యజమాని చేతిలో మోసపోయాడు. యజమాని కూడా మహిళే కావడంతో అతను ఆడ జాతి మీద అసహ్యం పెంచుకున్నాడు. ఎలాగైనా అరే ఆడ జాతిని అంతం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే కనిపించిన స్త్రీనల్లా చంపేందుకు కుట్రలు పన్నాడు. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఆడవాళ్లు అనుకొని వాచ్ మెన్ దంపతులను హత్య చేశాడు. చీకట్లో హత్యలు చేయడంతో అతడు ఓ పురుషుడిని కూడా చంపాడు. 


రెండు వారాల్లోనే ముగ్గురి హత్య..


అయితే వారిద్దరూ ఆడవాళ్లేనా కాదా అని తెలుసుకునేందుకు మృతదేహాల ప్రైవేట్ పార్ట్స్ ను చూసేవాడు. తర్వాత వాటిపై తన్నుతూ, విపరీతంగా కొట్టేవాడు. అలా తన కోపాన్ని కాస్త చల్లార్చుకునే వాడు. కానీ మరో మహిళ కనిపిస్తే.. ఆ కోపం అంతా ఆమెపైకి షిఫ్ట్ అయ్యేది. ఇలాగే మరో వారం రోజుల తర్వాత ఇంకో మహిళలను హత్య చేశాడు. ఇలా ఇప్పటి వరకు మొత్తం మూడు హత్యలు చేశాడు. మరో మహిళను కూడా చంపేందుకు యత్నించాడు. కానీ ఆమె అదృష్టం బాగుండి బతికిపోయింది. కానీ దాడి సమయంలో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 


క్షుద్ర పూజలు చేస్తూ.. పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తూ..!


వాచ్ మెన్ లు అయితే తక్కువ సెక్యూరిటీ ఉంటుందని.. ఆ ఆడవాళ్లను మాత్రమే చంపేవాడు. అయితే గత కొన్ని నెలలుగా ఆయన పరిస్థితి బాగా లేదని స్థానికులు చెబుతున్నారు. రాంబాబు అద్దెకు ఉన్న ఇంట్లో కూడా క్షుద్ర పూజలు చేసేవాడని.. పిచ్చి పిచ్చిగా కేకలు వేసేవాడని తెతిపారు. దీంతో ఇంటి యజమాని అతడిని ఇళ్లు ఖాళీ చేయించి పంపించాడు. రాంబాబుకు 27 ఏళ్ల కుమారుడు, 26 ఏళ్లు కూతురు ఉన్నారు. కానీ తండ్రి పరిస్థితి బాగా లేకపోవడంతో అతడిని వారు ఇంటికి రానిచ్చే వారు కాదు. గతంలో రాంబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏజెంట్ గా పని చేశాడు. అంతే కాకుండా ఆటో కూడా నడిపేవాడని పోలీసుల విచారణలో తేలింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసులు ఇంకా ఏమైనా ఉన్నాయా లేదా అనేది తెలుసుకునే పనిలో పడ్డారు.