Nandyala Crime News: రెండేళ్ల క్రితం అంగరంగ వైభవంగా కూతురికి పెళ్లి చేశాడు. ఆమె అంతకు ముందే ఓ అబ్బాయిని ప్రేమించింది. వేరే వ్యక్తితో పెళ్లై రెండేళ్ల గడుస్తున్నా అతడిని మర్చిపోలేక పోతోంది. ఇప్పటికీ వారిద్దరి మధ్య రిలేషన్ ఉండడంతో భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేసింది. విషయం తెలుసుకున్న తండ్రి.. కూతురు కుటుంబం పరువు తీస్తుందని భావించి గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లి తల, మొండం వేరు చేసి ఒక్కో చోట పడేశాడు. ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేశాడు. కానీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 


అసలేం జరిగిందంటే..?


నంద్యాల జిల్లా ఆలమూరు గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ప్రసన్నకు  ఏళ్లు. రెండేళ్ల క్రితమే ఆమెను ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరుకు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. వారిద్దరూ హైదరాబాద్ లోనే నివాసం ఉండేవారు. అయితే పెళ్లికి ముందే ప్రసన్న మరో వ్యక్తిని ప్రేమించింది. అతనితో సాన్నిహిత్యం కారణంగా ఇటీవల హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చేసిన ఆమె తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు. దీంతో తన పరువు పోయిందని భావించిన తండ్రి దేవేందర్ రెడ్డి కుమార్తెపై కోపం పెంచుకున్నాడు. కూతురును చంపి అయినా సరే పరువు కాపాడుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల వ తేదీన కూతురు గొంతు నులిమి హత్యే చేశాడు. అనంతరం మరికొందరితో కలిసి మృతదేహాన్ని కారులో నంద్యా-గిద్దలూరు మార్గంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. 


తల, మొండం వేరు చేసి మరీ ఒక్కోదాన్ని ఒక్కో చోట పడేశారు. తిరిగొచ్చి ఏం తెలియనట్లు ఉన్నాడు. ఈ మధ్య మనవరాలు ఫోన్ చేయకపోవడంతో తాత శివారెడ్డికి అనుమానం వచ్చి ప్రసన్న ఎక్కడికి వెళ్లిందని ఆరా తీశారు. దేవేందర్ రెడ్డికి గట్టిగా నిలదీయడంతో పరువు పోయిందని కుమార్తెను చంపినట్లు తెలిపాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు గురువారం దేవేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రసన్న మృతదేహాన్ని పడేసిన ప్రాంతానికి తీసుకెళ్లారు. రోజంతా గాలించినా దొరకలేదు. శుక్రవారం మళ్లీ గాలించగా తొల, మొండం దొరికాయి. పోస్టుమార్టం కోసం వాటిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 



నెల్లూరులో ఈ మధ్యే డాక్టర్ హత్య 


ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఇటీవల ఓ ఆర్ఎంపీ డాక్టర్ హత్య సంచలనంగా మారింది. అసలు కారణం తెలుసుకుని పోలీసులే విస్తు పోయారు. డాక్టర్ సంధానీ భాషాని చంపించింది మరో డాక్టర్ అని తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వెంకటగిరి పట్టణానికి చెందిన సంధాని భాష మంచి డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండేవారు. ఈయన రాకతో సత్రం గ్రామానికి చెందిన డాక్టర్ మునిప్రకాష్ కి బిజినెస్ పడిపోయింది. దీంతో సంధానీ భాషాపై కక్ష పెంచుకున్నాడు. అతడిని అడ్డు తొలగించుకోడానికి పథకం పన్నాడు. చివరకు హత్య చేయించాడు.


సంధానీ భాషాని హత్య చేయాలంటూ డాక్టర్ మునిప్రకాష్, సుబ్రహ్మణ్యం అనే ఆటో డ్రైవర్ కి చెప్పాడు. అతడు తిరుపతి నుంచి ఇద్దరు ప్రొఫెషనల్ కిల్లర్స్ ని తీసుకొచ్చాడు. వారిద్దరినీ కొన్నాళ్లపాటు వెంకటగిరి లాడ్జిలో ఉంచాడు. వారు ప్రతిరోజూ రెక్కీ నిర్వహించేవారు. వారితోపాటు ఇంకొందరు అదే లాడ్జీలో హత్యకు పథక రచన చేశారు. చివరకు ఓరోజు సంధానీభాషా ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో రాత్రివేళ కాపుకాసి కత్తులతో పొడిచి హత్య చేశారు.