Nagole Missing Boys: హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు స్కూల్ పిల్లలు మిస్సింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సాయిరాం నగర్‌లో ఉన్న మొగిలి రవి, శిరీష దంపతుల కుమారులు వరుణ్ తేజ్ (4వ తరగతి), మహేష్ (2వ తరగతి) శనివారం ఉదయం స్కూల్‌కు వెళ్లమని మారాం చేశారు. దీంతో తల్లి వారిని మందలించి, స్కూల్‌కు పంపేందుకు ఆటోలో కూర్చోబెట్టింది. అనంతరం లోపలికి వెళ్లి స్కూల్ బ్యాగులు తీసుకువచ్చే లోపే, ఆ బాలురు ఇద్దరూ ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. బయటకు వచ్చి చూసేసరికి పిల్లలు కనిపించకపోవడంతో కంగారుపడి చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు నాగోల్ పోలీసులను ఆశ్రయించారు.    Also Read: ఫ్రెండ్ రూంకు వెళితే బలవంతంగా మద్యం తాగించి, ఇద్దరు బాలికలపై లైంగిక దాడి

Continues below advertisement

సీసీ కెమెరాల్లో  

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి, పరిసర ప్రాంతాల సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో చిన్నారులు ఒక కిరాణా షాపులో చాక్లెట్లు కొనుగోలు చేసినట్లు, ఆ తర్వాత ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద రోడ్డు దాటి ఘట్‌కేసర్ వైపు వెళ్లినట్లు దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనపై మల్కాజిగిరి కమిషనరేట్ ఎల్బీనగర్ ఏసీపీ రవీందర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా తనిఖీలు ముమ్మరం చేశారు. తమ పిల్లలు సురక్షితంగా ఇంటికి తిరిగొస్తారని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదనతో ఎదురుచూస్తున్నారు.    Also Read: హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా రట్టు.. రూ. 6.78 కోట్ల ఫేక్ నోట్లు సీజ్, నలుగురి అరెస్ట్

Continues below advertisement