Mumbai Children Kidnapped at Powai Acting Studio: ముంబై పొవైలోని ఆర్‌ఏ స్టూడియోలో యాక్టింగ్ ఆడిషన్ కోసం వచ్చిన 17 మంది పిల్లలు (13-17 సంవత్సరాలు), ఇద్దరు పెద్దవాళ్లను బందీలుగా ఉంచుకున్న షాకింగ్ ఘటన బుధవారం అక్టోబర్ 30, 2025 జరిగింది. ఫిల్మ్‌మేకర్, యూట్యూబ్ నడిపే రోహిత్ ఆర్యా అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోవై పోలీసులు క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టీ)తో కలిసి 2:30 గంటలకు స్టూడియోలోకి దూకి, అందరినీ సురక్షితంగా రక్షించారు. మొత్తం 19 మంది బందీలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అడ్డుకోబోయిన రోహిత్ ఆర్యను పోలీసులు కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది.
మహావీర్ క్లాసిక్ భవనంలోని ఆర్‌ఏ స్టూడియోలో రోహిత్ పిల్లలను లాక్ చేసిన విషయంపై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చింది. పోవై పోలీసులు, ఫైర్ బ్రిగేడ్, ఆంబులెన్స్‌లు సైట్‌కు చేరుకున్నాయి. రోహిత్ వీడియో విడుదల చేసి, "నేను టెర్రరిస్ట్ కాదు, కొంతమందితో మాట్లాడాలి. లేకపోతే నేను, పిల్లలు అందరూ మరణిస్తాం" అని బెదిరించాడు. ఇన్‌స్పెక్టర్ విజయ్ సలుంకే టీమ్ బాత్‌రూమ్ గ్రిల్‌ను బ్రేక్ చేసి లోపలికి దూకింది. అక్కడ రోహిత్ ఆర్యను కాల్చి.. తర్వాత అందరినీ స్కూల్ బస్సులో బయటకు తీసుకువచ్చారు.
మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 17 మంది యాడ్ షూట్ కోసం ఆడిషన్‌కు వచ్చారు. రోహిత్ వెబ్ సిరీస్ డైరెక్టర్‌గా ప్రకటించుకుని, వాళ్లను లాక్ చేశాడు. స్టూడియోలో ఎయిర్‌గన్, అజ్ఞాత కెమికల్స్ కూడా ఉన్నాయి. దీంతో కాల్చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన సంచలనం సృష్టించింది. కాల్పులతో గాయడిన రోహిత్ ఆర్యను ఆస్పత్రికి తరలించడంతో అక్కడ చనిపోయారు.
పిల్లలతో సంబంధం లేదని ఆయన కొంత మందితో మాట్లాడాలని అనుకున్నట్లుగా వీడియో విడుదల చేశాడు. అతనికి మానసిక సమస్యలు ఉన్నాయని.. తనకు రాావాల్సిన డబ్బుల గురించి అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. మొత్తంగా పిల్లల్ని రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.