By: ABP Desam | Updated at : 19 May 2023 10:28 PM (IST)
Edited By: Pavan
మూడో పెళ్లి చేసుకున్న భార్యను చంపిన రెండో భర్త, కారణమేంటంటే!
Mancherial Crime News: మంచిర్యాల జిల్లా కేంద్రంలో పట్టపగలే కొందరు దుండగులు మహిళను నరికి చంపిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దళిత బస్తీ కింద ఇచ్చిన మూడు ఎకరాల భూమి విషయంలోనే మహిళను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఆ మహిళను చంపింది రెండో భర్త, మామ, మరిదేనని గుర్తించారు. ఆమెను హత్య చేసిన ఆ ముగ్గురూ కోటపల్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు మహిళపై దాడి చేసి చంపేశారు. అందరూ చూస్తుండగానే మహిళపై కత్తులతో దాడి చేశారు. ఆ ముగ్గురు వ్యక్తులు TS-19-E-7695 బైక్ పై వచ్చి కత్తులతో నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన మహిళను రాజీవ్ నగర్ కాలనీకి చెందిన స్వప్న శ్రీ గా పోలీసులు తేల్చారు. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. స్వప్నశ్రీ మొదటి భర్త చనిపోవడంతో వేల్పుల మధు అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. కోటపల్లి మండలం వెంచపల్లిలో దళితబస్తీ కింద స్వప్న పేరుతో మూడెకరాల భూమి వచ్చింది. రెండో భర్తతో మనస్పర్ధలు వచ్చి స్వప్న వేరే వ్యక్తితో మంచిర్యాలలో ఉంటోంది. తన పైరవీ వల్లే భూమి వచ్చిందని తన భూమి తనకు కావాలంటూ స్వప్నపై రెండో భర్త మధు ఒత్తిడి తెచ్చాడు. రెండో భర్త మధు, స్వప్న శ్రీ మధ్య భూమి విషయంలో కొంత కాలంగా వివాదం నడుస్తోంది.
అదను చూసి కత్తులతో నరికి చంపిన నిందితులు
ఈ భూవివాదంపై పెద్దలను పిలిచి పంచాయితీ పెట్టించారు. మూడు నెలల్లో మూడు లక్షలు కడితే సగం భూమిని మధుకు రాసివ్వాలని పెద్దలు చెప్పి ఒప్పించారు. అప్పుడు సరేనన్న మధు.. ఆ తర్వాత మాట మారుస్తూ తనకే మొత్తం భూమి కావాలని స్వప్న శ్రీపై ఒత్తిడి తెచ్చాడు. రెండు లక్షలు, రైతు బంధు కింద వచ్చింది మరో లక్ష కడతానని చెప్పాడు. దానికి స్వప్న శ్రీ ససేమిరా అన్నది. దీంతో స్వప్నశ్రీపై మధు కక్ష పెంచుకుని అదను కోసం చూశాడు. ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం రోడ్డుపై స్వప్న ఒంటరిగా చిక్కించుకుని మరో ఇద్దరితో కలిసి మధు స్వప్నను కిరాతకంగా కత్తులతో నరికి చంపాడు. తీవ్ర రక్తస్రావంతో స్వప్న ప్రాణాలు కోల్పోయింది.
తమ్ముడు, తండ్రితో కలిసి చంపిన మధు
మధు, అతని సోదరుడు, తండ్రి ముగ్గురు కలిసి స్వప్నశ్రీని హత్య చేసినట్లు మృతురాలి మూడో భర్త ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. స్వప్న మృతదేహాన్ని మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసులో పురోగతి సాధించారు. హత్య చేసిన వారు నేరుగా వెళ్లి కోటపల్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. ఇక మూడో భర్తను సైతం మంచిర్యాల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Kurnool News: కుమారులు అంటే భయం- భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య
Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!
Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!
స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక చితిలోకి దూకిన వ్యక్తి, తీవ్ర గాయాలతో మృతి
Nizamabad Crime: అప్పు తీర్చు, లేకపోతే కోరిక తీర్చాలంటూ డాక్టర్ వేధింపులు- నర్సు ఆత్మహత్య!
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!