Man Killed in Saidabad | హైదరాబాద్‌: నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దారుణహత్య జరిగింది. సింగరేణి కాలనీలో నడిరోడ్డుపై ఒక వ్యక్తిని కొబ్బరి బోండాలు నరికే కత్తితో అందరూ చూస్తుండగానే నరికి హత్య చేయడం కలకలం రేపింది. 

Continues below advertisement

అసలేం జరిగింది..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్ పీఎస్ పరిధిలోని సరస్వతీనగర్ డివిజన్ లోని సింగరేణి కాలనీలో నడిరోడ్డుపై ఆమేర్ (35) అనే వ్యక్తిపై మంగళవారం సుమన్ (రాజు) అనే యువకుడు కొబ్బరి బోండాలు నరికే కత్తితో అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే రోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేయడంతో కింద పడిపోయాడు. చుట్టుపక్కల వారు వద్దని వారిస్తున్నా, బాధితుడు ఆమేర్ కింద పడిపోయినా.. వదలిపెట్టకుండా నిందితుడు సుమన్ విచక్షణారహితంగా నరకడంతో ఆమేర్‌కు తీవ్ర రక్తస్రావం అయింది. 

Continues below advertisement

కత్తితో దాడి చేస్తున్న నిందితుడు 

దాడి జరిగిన వెంటనే స్థానికులు స్పందించి ఆమేర్‌ను కుటుంబసభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే హమేర్ మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, హత్య ఘటన వివరాలు సేకరించారు.

Also Read: Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

ఆమేర్ హత్యకు పాత కక్షలు లేదా వ్యక్తిగత విభేదాలు ఏమైనా కారణమా, లేక వేరే ఏదైనా వివాదం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కత్తితో నరిక హత్య చేసిన నిందితుడు సుమన్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా, మృతుడు ఆమేర్‌పై గతంలో కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు.