Machavaram police file case against YCP Legal Cell lawyer Venkatesh Sharma: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాది వెంకటేష్ శర్మపై మచవరం పోలీసులు కేసులు పెట్టారు. ఓ విడాకుల కేసు విషయంగా సలహా తీసుకోవడానికి వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వెంకటేష్ శర్మ మహిళలతో అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
విడాకులు సలహా కోసం వచ్చిన మహిళతో అసభ్య ప్రవర్తన
ఎన్టీఆర్ జిల్లా మచవరం మండలానికి చెందిన మహిళ తన విడాకుల కేసుకు సంబంధించి లీగల్ సలహా కోసం వెంకటేష్ శర్మను సంప్రదించింది. శర్మ వైసీపీ పార్టీ లీగల్ సెల్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, సలహా సమయంలో శర్మ అసభ్యమైన మాటలు, పదాలు ఉపయోగించి పార్వతిని భయపెట్టారు. న్యాయవాదిగా బాధ్యతగా వ్యవహరిచలేదని అసభ్యంగా ప్రవర్తించారనికేసు పెట్టారు. ఫిర్యాదు మేరకు శర్మపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 75(1)(i) కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ మహిళలపై అసభ్య ప్రవర్తన, లైంగిక హింసకు సంబంధించినది.
వెంకటేశ్ శర్మ పాత వీడియోలన్నీ వెలుగులోకి - కరో కరో జల్సా టైప్
ఈ ఫిర్యాదు వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే, శర్మపై ఇతర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఆయన వ్యవహారంపై వీడియోలు వైరల్ అయ్యాయి. శర్మ క్లబ్బుల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు కనిపించారు. ఒక వీడియోలో అతను మహిళల వైపు కరెన్సీ నోట్లు వెదజల్లుతూ కనిపించారు. మద్యం తాగి అనుచితంగా డాన్స్ చేస్తున్నట్టు కనిపించింది. మరో వీడియోలో డబ్బు కట్టలు చేతిలో పట్టుకుని, మహిళలతో సన్నిహితంగా మాట్లాడుతున్నట్టు కనిపించారు.
పాత కేసులన్నీ వెలికి తీస్తున్న పోలీసులు
పోలీసులు శర్మపై గతంలో వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలిస్తున్నారు. శర్మపై మునుపటికీ మహిళలతో అనుచిత ప్రవర్తనకు సంబంధించి రెండు-మూడు ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, వాటిని రాజీ చేశారని పోలీసులకు పూర్తిగా చేరలేదని సమాచారం. వైసీపీ లీగల్ సెల్ నేతలు ఈ విషయంపై అధికారిక ప్రతిస్పందన ఇవ్వలేదు.