Current Lineman Died Due To Current Shock: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విధుల్లో చేరిన 7 నెలల్లోనే ఓ లైన్ మెన్ (Lineman) విధి నిర్వహణలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్ స్తంభంపై వైర్లు సరిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. స్థానికులు, విద్యుత్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మునిపల్లి (Munipally) మండల పరిధిలో మల్లికార్జునపల్లి గ్రామంలో బాలరాజు అనే లైన్మెన్ విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఓ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. సరి చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు. అక్కడ విద్యుత్ తీగలు సరి చేస్తుండగా.. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో ప్రమాదానికి గురయ్యాడు. తీగల్లో చిక్కుకుని గాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాన్ని కిందకు దించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. మృతుని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 


7 నెలల్లోనే..


సంగారెడ్డి పట్టణానికి చెందిన బాలరాజు గత అక్టోబర్ నెలలోనే మల్లికార్జునపల్లిలో జూనియర్ లైన్మెన్ గా విధుల్లో చేరాడు. అతనికి ఓ చెల్లి ఉన్నారు. తండ్రి సంగారెడ్డి మున్సిపాలిటీలో శానిటేషన్ వర్కర్‌గా పని చేస్తున్నారు. కాగా, లైన్ మెన్ మృతి ఘటనపై విద్యుత్ అధికారులు విచారణ చేపట్టారు.


Also Read: Raids On Clinics: నగరంలో క్లినిక్స్‌పై వైద్యాధికారుల దాడి - 50 మందికి పైగా నకిలీ డాక్టర్ల గుర్తింపు