Kukatpally News : బ్యూటీ పార్లర్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ పార్లర్ పై ఎస్.ఓ.టి పోలీసులు దాడి చే నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో సాయి కృష్ణ అపార్ట్మెంట్స్ లో రాజు, మరో ఇద్దరు నిర్వాహకురాళ్లతో కలిసి లావిష్ బ్యూటీ పార్లర్, వెల్నెస్ సెంటర్ అనే పార్లర్ ఏర్పాటు చేశారు. పార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందటంతో మంగళవారం ఎస్.ఓ.టి, కూకట్‌పల్లి పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతో పాటు ఓ యువతిని, ఓ విటుడిని అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు.
కోరిక తీర్చలేదని బావను చంపిన మరదలు
ఆరేళ్ల క్రితం ఓ మహిళ భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఒంటరిగానే అత్తారింట్లో ఉంటుంది. ఆమెను తన ఫ్యామిలీ మెంబర్ అనుకొని తండ్రి స్థానంలో ఉండి బావ పోషిస్తూ వచ్చాడు. అలాంటి బావపై కన్నేసిందామె. భర్త లేని లోటు తీర్చమంటూ వేధించడం మొదలు పెట్టింది. అది తప్పు వద్దని బావ చెప్పినా వినిపించుకోలేదు. దీంతో అతడిని హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. ఇద్దరు యువకుల సాయంతో బండరాళ్లతో మోది మరీ బావను చంపేసింది. విషయం వెలుగులోకి రాగానే గ్రామస్థులంతా నిలదీశారు. తప్పును ఒప్పుకున్న సదరు మహిళను గ్రామస్థులంతా కలిసి నిందించారు. ఇష్టం వచ్చినట్లుగా తిడుతూనే.. చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించారు. ఆపై పోలీసులకు అప్పగించారు.
అసలేం జరిగింది?
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారు సిగ్నల్ తండాలో దారుణం చోటు చేసుకుంది ఈ దారుణం. తండాకు చెందిన బానోతు రాజును ఆయన తమ్ముడి భార్యే హత్య చేసింది. రాజు తమ్ముడు గోపి ఆరేళ్ల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి అతని భార్య అత్తారింటి వద్దే ఒంటరిగా ఉంటోంది. అలా కాలం గడిచే కొద్ది బావ రాజుపై సదరు మహిళ మనసుపడింది. తరచుగా భర్త లేని లోటును తీర్చమంటూ.. వేధించడం మొదలు పెట్టింది. అలా చేయడం తప్పు, నేనెలా చేయలేనని రాజు వాదించే సరికి అతడిపై కోపం పెంచుకుందా మహిళ. ఈ క్రమంలోనే అతడిని ఎలాగైనా సరే చంపేయాలని నిర్ణయించుకొని హత్యకు పన్నాగం పన్నింది. ఈనెల 10వ తేదీన బావ రాజును మున్నేరు వాగు సమీపంలోకి తీసుకు వెళ్ళింది. అయితే ముందుగానే మరో ఇద్దరు యువకులను కూడా అక్కడకు రమ్మని చెప్పింది. వారి సాయంతో వాగు వద్ద బండరాళ్లతో మోది బావ రాజును చంపేసింది.
చెప్పుల దండ వేసి ఊరేగించిన గ్రామస్థులు..!
ఆపై తనకు ఏమీ తెలియనట్లుగా ఇంటికి వెళ్లిపోయింది. రెండు మూడ్రోజుల తర్వాత రాజు మృతదేహం వెలుగులోకి వచ్చింది. అయితే రాజు మరదలుపై అందరికీ అనుమానం రావడంతో గ్రామస్థులు గట్టిగా నిలదీశారు. దీంతో భయపడిపోయిన ఆమె తన తప్పును ఒప్పుకుంది. కోరిక తీర్చలేదనే కోపంతోనే తన బావను మట్టుపెట్టానని వివరించింది. ఇందుకు మరో ఇద్దరు కూడా సహకరించారని వారి పేర్లను కూడా వెల్లడించింది. తండ్రిలా చూసుకున్న బావను చంపేయడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ చెప్పుల దండ మెడలో వేసి ఊరంతా తిప్పారు. విపరీతమైన బూతులు తిట్టుకుండా ఊరేగించారు. ఆపై పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళను అరెస్ట్ చేసి ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. త్వరలోనే కోర్టుకు పంపుతామని చెప్పారు.