Konaseema Crime : కోనసీమ జిల్లాలో ప్రేమ పేరిట బాలికపై లైంగిక దాడి చేశాడో యువకుడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి రోల్డ్ గోల్డ్ ఉంగరం తొడిగి బాలికతో శారీరకంగా కలిశాడు. విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో యువకుడు పరారయ్యాడు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని ఓ గ్రామంలో ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను మోసం చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వానపల్లి శివారు రామ్మోహనరావుపేటకు చెందిన 14 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరిట వెంటబడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాడు. ఈ నెల 10న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న బలవంతం చేశాడు. 12వ తేదీన బాలిక స్కూల్‌లో ఉండగా తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు వెళ్దామని చెప్పిత బయటకు తీసుకెళ్లాడు. స్థానికంగా ఉన్న ఒక రూములోకి తీసుకెళ్లి రోల్డ్ గోల్డ్ ఉంగరం బాలికకు తొడిగి పెళ్లి అయిపోయిందని చెప్పి శారీరకంగా కలిశాడు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో యువకుడి పరారయ్యాడు. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
తమిళనాడులో దారుణం
తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు కామాంధులు బాలికపై అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. సామూహిక లైంగికదాడికి పాల్పడిన దుర్మార్గులు బ్లాక్ మెయిల్ చేస్తూ బాలికతో పైశాచికంగా ప్రవర్తించారు. ఇటీవల తమిళనాడు తిరుచ్చిలో జరిగిన ఘటనలో సంచలం అయింది. బాలికపై దారుణానికి పాల్పడిన వారిలో బంధువు కూడా ఉన్నాడు. బంధువుతో పాటు మరో నలుగురు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి బంధువుతో పాటు మరో నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఏడాదిగా అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను చూపిస్తూ బాలికను బ్లాక్ మెయిల్ చేశారు నిందితులు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. గత ఏడాది ఏప్రిల్ లో బాలిక బంధువు రంగనాథ్ బైకుపై ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చాడు. ఆ తర్వాత రంగనాథ్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దాన్ని ఫోన్లో రికార్డ్ చేసి తన నలుగురు స్నేహితులకు ఆ వీడియో పంపాడు. ఆ వీడియోను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ నలుగురు నిందితులు పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
వాట్సాప్ లో వీడియో సర్య్కూలేట్
బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు తిరుచ్చిలోని ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే బాలల హక్కుల సంఘానికి ఈ విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందించి బాలికను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. వాట్సాప్ లో బాలిక లైంగిక వేధింపుల వీడియో వైరల్ గా మారింది. దీంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగనాథ్ స్నేహితుల్లో ఒకరు ఈ వీడియోను వాట్సాప్ లో షేర్ చేయడంతో రంగనాథ్, అతని స్నేహితులకు మధ్య గొడవ జరిగింది. బాలిక ఫిర్యాదుతో రంగనాథన్, మణికందన్, గణేష్ లను పోలీసులు అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.