Kerala Stampede News : కేరళలోని ఓ యూనివర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. వర్సిటీలో జరిగిన టెక్ ఫెస్ట్ లో ఒక్కసారిగా తొక్కిసలాట (Kochi Stampede) జరగడంతో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో 60 మంది విద్యార్థులు గాయపడ్డారని తెలుస్తోంది. కేరళలోని కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆడిటోరియం బయట ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా లోపలికి రావడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
Cochin Stampede Updates: క్యాంపస్‌లోని ఓపెన్ ఆడిటోరియంలో నిఖితా గాంధీతో మ్యూజిక్ కన్సార్ట్ (music concert by Nikhita Gandhi ) నిర్వహించారు. అదే సమయంలో తొక్కిసలాట జరగడంతో విషాదం చోటుచేసుకుంది. ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశాలతో కలమస్సేరి మెడికల్ కాలేజీలో విద్యార్థులకు చికిత్స అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరో 18 మంది స్టూడెంట్స్ ను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వీరిలో ఒకరి తలకు గాయం అయిన విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
Photo: Twitter/ANI Video
కొచ్చి వర్సీటీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎర్నాకుళం జిల్లా కలెక్టర్ NSK ఉమేష్ స్పందించారు. నలుగురు విద్యార్థులు చనిపోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వారిని ఆస్టర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. తొక్కిసలాట జరిగిన వెంటనే కలమస్సేరి మెడికల్ కాలేజీకి తరలించి 50 మందికి చికిత్స అందిస్తున్నారు. వారిలో 15 మందిని అబ్వర్వేషన్ లో పెట్టారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ తెలిపారు.
టెక్ ఫెస్ట్ లో భాగంగా నిఖితా గాంధీ మ్యూజిక్ కన్సార్ట్ ను వర్సిటీలోని ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కు కొందర్ని మాత్రమే అనుమతించారు. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న వారు ఎంట్రీ పాస్ లేనందున ఆడిటోరియం బయట నుంచే ప్రోగ్రామ్ వీక్షించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో పరిస్థితి అదుపు తప్పింది. వానలో తడిచిపోతామని.. ఆడిటోరియం బయట ఉన్న వారు భారీ సంఖ్యలో ఆడిటోరియంలోకి చొచ్చుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. వాస్తవానికి ఇది మూడు రోజుల పాటు జరిగే టెక్ ఫెస్ట్ కాగా, రెండో రోజులో భాగంగా మ్యూజిక్ కన్సార్ట్ నిర్వహించగా.. వర్షం రావడంతో తొక్కిసలాట జరిగి కొందరు విద్యార్థులు చనిపోయారు.
Also Read: Telangana Elections 2023: తెలంగాణ ఇవ్వడం మేం చేసిన రిస్క్- కాంగ్రెస్ నేత జైరాం రమేష్
శశిథరూర్ దిగ్భ్రాంతి
కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్&టెక్నాలజీలో జరిగిన ఫెస్ట్ లో తొక్కిసలాట ఘటనపై కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వర్షం పడిన కారణంగా వర్సిటీ క్యాంపస్ లో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. విద్యార్థుల మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply