కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 2న జరిగిన హత్య కేసును జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కాకినాడ సాంబమూర్తినగర్‌లో గండి గిరిధర్‌ (30) హత్యకు గురైన కేసులో పాలేపు వివేక్, ఏలూరి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వదకద నుంచి 4 ఫోన్లు, కత్తి, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. అశ్లీల వీడియోలు ఇవ్వని కారణంగా గిరిధర్‌ను హత్య చేసినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. 

Continues below advertisement

ఈ నెల 2న దారుణహత్య

హత్య కేసుకు సంబంధించిన వివరాలను కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ, ఇన్చార్జి డిఎస్పి డాక్టర్ మహంతి కిషోర్ కుమార్  ఆదివారం నాడు మీడియాకు వెల్లడించారు. కాకినాడ త్రీ టౌన్ లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాంబమూర్తి నగర్ ఇందిరా కాలనీ, సెవెన్ హిల్స్ రోడ్లో నివాసం ఉంటున్న గండి గిరిధర్ అనే వ్యక్తి ఈ నెల 2వ తేదీన తన నివాసంలోనే గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. 

Continues below advertisement

ప్రత్యేక దర్యాప్తు బృందాల ఏర్పాటు

మృతుడి తల్లి గండి జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కెవిఎస్ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య కేసును కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఆయన ఆదేశాల మేరకు తన పర్యవేక్షణలో, కాకినాడ త్రీ టౌన్ లా ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కెవిఎస్ సత్యనారాయణ ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాలతో పాటు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, సంఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించామని కిషోర్ కుమార్ తెలిపారు.

నిందితులు అరెస్టు  దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు ఈ నెల 12వ తేదీన తేదీన కాకినాడ త్రీ టౌన్ లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కెవిఎస్ సత్యనారాయణ నిందితుల్ని గుర్తించారు. పాలేపు వివేక్ @ బన్నీ, ఏలూరి రామకృష్ణ అనే ఇద్దరు యువకులను చేసినట్లు తెలిపారు. 

 దర్యాప్తులో తేలింది ఏంటంటే..

మృతుడు గండి గిరిధర్  గతంలో వివాహం అయ్యి భార్యతో ఏర్పడిన విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం తన తల్లితో కలిసి ఉంటున్నాడు. మృతుడు తనకు పరిచయం ఉన్న కొంత మంది యువతులు, మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను తన సెల్‌ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. తనతో సన్నిహితంగా తిరిగే అదే ప్రాంతానికి చెందిన నిందితులు బన్నీ, రామకృష్ణలకు మద్యం మత్తులో ఆ ఫొటోలు, వీడియోలను చూపించాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ నిందితులు, ఆ ఫొటోలు, వీడియోలను మృతుడి వద్ద నుంచి తీసుకుని, వాటిలో ఉన్న మహిళల కుటుంబ సభ్యులను బెదిరించి డబ్బులు సంపాదించవచ్చని భావించారు. ఈ ఉద్దేశంతో మృతుడి వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలను ఎలాగైనా తీసుకోవాలని నిందితులు ప్లాన్ వేసుకున్నారు.

ఈ నెల 1వ తేదీ రాత్రి సమయంలో మృతుడి తల్లి, పక్క పోర్షన్లో నివసించే మృతుడి అన్నయ్య, వారి కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని తెలుసుకున్నారు నిందితులు. అదే రోజు రాత్రి సుమారు 12.15 గంటలకు మృతుడి ఇంటికి వెళ్లారు. అక్కడ  మృతుడితో యువతుల ఫొటోలు, వీడియోలు కావాలని అడగగా ఇచ్చేందుకు గిరిధర్ నిరాకరించాడు. ముందుగానే తీసుకువెళ్లిన కత్తితో మృతుడి గొంతుపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై గిరిధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితులు సంఘటనా స్థలం నుండి పరారయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన  సాక్ష్యాధారాలు, సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజ్, ఇతర అందుబాటులో ఉన్న ఆధారాలను సమగ్రంగా విశ్లేషించారు. నిందితులను విచారించగా, ఈ హత్య చేసినట్లు వారు అంగీకరించారు. మరిన్ని సాక్ష్యాధారాల సేకరణ, సాంకేతిక ఆధారాల విశ్లేషణ, ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు.

నిందితుల వద్ద నుండి ఆధారాలు స్వాధీనం 

నిందితుల వద్ద నుండి మృతుడిని హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి, హత్య జరిగిన సమయంలో నిందితులు ధరించిన  దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు సంబంధించిన 4 సెల్ ఫోన్లు, ఒక పెన్ డ్రైవ్, మృతుడి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు ఇతర సాక్ష్యాధారాలను కేసు దర్యాప్తులో భాగంగా తదుపరి శాస్త్రీయ పరీక్షలు, చట్టపరమైన ప్రక్రియ నిమిత్తం భద్రపరిచామన్నారు.

పోలీసు బృందానికి అభినందనలు హత్య జరిగిన అనంతరం కేసును సవాలుగా తీసుకుని, దర్యాప్తు పూర్తి చేసి నిందితులను గుర్తించి అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ కెవిఎస్ సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్లు  జివివిఎస్ చౌదరి, వి ఆంజనేయరాజు హెడ్ కానిస్టేబుల్ సతీష్, కానిస్టేబుల్స్ మురళిరాజు, బి శ్రీనివాసరావు, ప్రేమ్ కుమార్, క్రైమ్ టీం సిబ్బందిని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ అభినందించారు.