Kaikaloor Police Police return stolen gold to elderly : దొంగతనం జరిగిన వస్తువు మళ్లీ చేతికి అందడం అంటే చిన్న విషయం. పోలీసులు ఎంతో సీరియస్ గా దర్యాప్తు చేసి.. ఆ దొంగతనం చేసిన వాళ్లు దాన్ని ఖర్చు పెట్టకుండా.. జల్సా చేయకుండా ఉంచితే.. రికవరీ చేసి అన్ని రికార్డులు పరిశీలించి.. తిరిగి అసలు వారికి ఇచ్చేస్తారు. దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అలాంటివి తిరిగి ఇచ్చినప్పుడు పోలీసులపై ఆ బాధితుల్లో ఉండే కృతజ్ఞతా భావం మాటల్లో చెప్పలేనిది.                             

మహిళలు బంగారాన్ని ప్రాణంతో సమానంగా చూసుకుంటారు. వృద్ధులతే ఆ బంగారమే తమ మిగతా జీవితానికి ధైర్యం అన్నట్లుగా గడిపేస్తూంటారు. అలాంటి  బంగారాన్ని దొంగుల దోచుకెళ్లిపోతే తమ ప్రాణం పోయినట్లుగా విలవిల్లాడిపోతారు. ఇలాంటి వృద్ధులకు వారి బంగారాన్ని తిరిగి తెచ్చి ఇస్తే.. మళ్లీ ప్రాణం లేచి వస్తుంది. పోలీసులపై వారు చూపించే కృతజ్ఞత  నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. అలాంటి వారికి సంతోషాన్ని మళ్లీ తీసుకురావడంలో పోలీసులు తమ సిన్సియారిటీని చూపిస్తే  విధి నిర్వహణలో వారికి సామాన్య ప్రజల ప్రశంసలు లభిస్తాయి. ఇలాంటి ప్రశంసలు కైకలూరు పోలీసులకు లభిస్తున్నాయి.                           కైకలూరు మండలం రామవరం గ్రామంలో ఇటీవల వరుసగా దొంగతనాలు జరిగాయి. గ్రామంలో ఉన్న  ఒంటరి, వృద్ధ మహిళలను టార్గెట్ చేసి వారి వద్ద ఉన్న బంగారాన్ని దోచుకెళ్లడమేపనిగా పెట్టుకున్నారు. వరుస దొంగతనం కేసుల్లో వారు లక్ష నగదుతో పాటు 88 గ్రాముల బంగారాన్ని దోచుకున్నారు. వృద్ధులనే టార్గెట్ చేయడంతో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దొంగలపై నిఘా పెట్టారు. చివరికి దొంగల్నిపట్టుకున్నారు. సొమ్ము రికవరీ చేశారు. ఎక్కడెక్కడ దొంగ బంగారం అమ్మేవాళ్లను కనుక్కునిప దృష్టి పెట్టి.. వారిని పట్టుకున్నారు. ఆ బంగారాన్ని బాధితులకు ఇచ్చేశారు. 

బంగారం పోగొట్టుకున్న వారంతా  వృద్ధులే కావడంతో  పోలీసులు తమ సొమ్మును రివకరీ చేసి ఇవ్వడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. [ 

కైకలూలు పోలీసులు దొంగలను పట్టుకుని సొమ్మును రికవరీ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.  కైకలూరు రూరల్, మండవల్లి, ముదినేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధుల్లో మొత్తం రూ.12,21,126 విలువైన ఆభరణాలు,నగదు రికవరీ చేసింది పోలీసు శాఖ.   బాధితులకు ఈరోజు జిల్లా ఎస్పీ గారి చేతులమీదగా అందచేశారు. కైకలూరు పోలీసులను ఎస్పీ అభినందించారు.