ఝార్ఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ధన్‌బాద్ జిల్లాలో ఉన్న బొగ్గు గనుల్లో పైకప్పు కూలిన ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. మరికొంత మంది గనుల్లో చిక్కుకున్నారు. ఈ గనుల్లో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
రెండు ఘటనలు..
మొదటగా సోమవారం సాయంత్రం 5 గంటలకు కాప్సరా ఔట్సోర్సింగ్ ప్రాజెక్ట్ వద్ద గని కూలిందని, ఆ తర్వాత కొన్ని గంటలకు బీసీసీఎల్ వద్ద ఉన్న గని మంగళవారం ఉదయం గోపీనాథ్‌పుర్ వద్ద గనుల్లో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. భారీ యంత్రాలతో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు.
ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈస్ట్రెన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (ఈసీఎల్)కు చెందిన గని నుంచి బయటపడ్డ మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు వెల్లడించారు.
కాపాసరలోని ఈసీఎల్, ఛాచ్ విక్టోరియా ఆఫ్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)కు చెందిన గనుల్లో కూడా మృతులు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సీఎం ట్వీట్..
గనుల్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గనుల్లో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేయమని ఆదేశించినట్లు తెలిపారు.
Also Read: India Corona Cases: దేశంలో నిన్న ఒక్కరోజులో 1,733 కరోనా మరణాలు.. కొత్తగా లక్షన్నర మందికి కొవిడ్
Also Read: PM e-Vidya: వన్ క్లాస్- వన్ టీవీ ఛానెల్.. హైక్వాలిటీ కంటెంట్‌తో 200 టీవీ ఛానెళ్లు.. బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపు ఇదీ..