Canada Punjabi Student Death News: కెనడాలో ఓ భారతీయ యువకుడు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. ఎడ్మంటన్‌లోని ఓ అపార్ట్‌మెంట్ భవనంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న 20 ఏళ్ల సిక్కు యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. సెంట్రల్ మెక్‌డౌగల్ పరిసరాల్లోని 106వ స్ట్రీట్, 107వ అవెన్యూ వద్ద ఉన్న భవనం నుంచి కాల్పుల శబ్ధం వినిపించడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారు సంఘటనా స్థలంలో రక్తపు మడుగులో ఉన్న యువకుడిని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వాన్ రెన్, జుడిత్ సోల్టో అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
ముందు గొడవ తర్వాత కాల్పులు
భారత్‌కు చెందిన హర్షదీప్ సింగ్ కెనడాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 12:30 ప్రాంతంలో ఫ్లాట్‌లో దుండగుల కాల్పుల్లో మరణించాడు. సంఘటన జరిగిన సమయంలో CCTV ఫుటేజీలో ముగ్గురు వ్యక్తులు యువకుడిని వేధించడం, మెట్లపైకి విసిరివేయడం పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరు అతడిని వెనుక నుంచి కాల్చాడు. కాల్పుల అనంతరం ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. భవనంలో నివసిస్తున్న జెస్సికా మొరాద్‌ఖాన్ మాట్లాడుతూ.. తనకు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించించ లేదని, అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే 20 నిమిషాల ముందు తాను ఫుట్ పాత్‌పై సిగరెట్ తాగుతున్నానని చెప్పారు. రోడ్డుపై వారు ముగ్గురు గొడవపడడం తాను చూశానన్నారు.
కొట్లాటలో పాల్గొన్న ఒక వ్యక్తి పోలీసు రిపోర్టు ఇవ్వడానికి లోపలికి రావాలని కోరాడని, గార్డును అనుసరించి భవనంలోకి వచ్చినట్లు తెలిపారు. కొద్ది నిమిషాల తర్వాత భవనంలో కాల్పులు జరిగాయని, హాల్‌లోని సెక్యూరిటీ గార్డు గాయపడ్డాడని తన రూమ్‌మేట్ తనకు ఫోన్ చేసి చెప్పాడని మొరద్‌ఖాన్ చెప్పాడు. భవనంలో తరచూ ఇక్కడ భద్రతాపరమైన సమస్యలు ఉంటాయని మొరద్‌ఖాన్ అన్నారు.
ఎడ్మంటన్ పోలీసులు ఏం చెప్పారు?
ఎడ్మాంటన్ పోలీసులు ఈ ఘటనపై స్పందించి వెంటనే యువకున్ని ఈఎంఎస్ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. "సింగ్ మరణంలో కొందరి ప్రమేయం ఉండొచ్చచు. అయితే, అరెస్టు సమయంలో ఒక ఆయుధం స్వాధీనం చేసుకున్నాం. సోమవారం, డిసెంబర్ 9, 2024న శవపరీక్ష నిర్వహించబడుతుంది" అని పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.