మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి హత్యకు గురైన జింక లచ్చన్న,రాజేశ్వరి దంపతుల మృతదేహాలను బంధువులు బుధువారం నిందితుడైన గూడ సత్తన్న ఇంటి ముందు ఉంచి ఆందోళన చేపట్టారు. మంగళవారం ఈ హత్యకు గురైన దంపతులకు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్షలు నిర్వహించారు. ఆనంతరం పోలీసులు దంపతులను మృత దేహాలను బుధవారం బంధువులకు అప్పజెప్పడంతో వారు నేరుగా చింతలపల్లె గ్రామంలోని నిందితుని ఇంటి ముందుకు మృతదేహాలను తరలించి అక్కడే దహన సంస్కారాలు చేసేందుకు సిద్దమయ్యారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామంలో లచ్చన్న రాజేశ్వరి దంపతుల హత్య చేసిన నిందుతుడి కఠినంగా శిక్షించాలని, నిందుతుడి ఇంటి ముందు మృతుల కుటుంబ సభ్యులు మృతదేహాలతో ఆందోళన చేపట్టారు. నిందితుడి ఇంటి ఆవరణలో అక్కడే అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. నిందితుడి ఇంటి ముందు జరుగుతున్న ఆందోళన విషయం తెలుసుకున్న లక్సెట్టిపేట సీఐ కరీముల్లాఖాన్ అధ్వర్యంలో పోలీసులు వెళ్లి వారించారు. కొద్దిసేపు వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమారు రెండు గంటలపాటు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
చివరకు లక్షెటిపేట్ సీఐ కరీముల్లాఖాన్, గ్రామపెద్దలు మృతుల బంధువులకు నచ్చజెప్పి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో శాంతించి మృతదేహాలను అక్కడి నుంచి తీసుకెళ్లి శ్మశానంలో దహనసంస్కారాలు నిర్వహించారు.