Robbery in Hyderabad: హైదరాబాద్ లో ఓవైపు చైన్ స్నాచర్లు..మరోవైపు దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ బార్ యజమాని నుంచి రెండుకోట్ల రూపాయలు కొట్టేశారు కంత్రీగాళ్లు. 


భాగ్యనగరం హైదరాబాద్ లో క్రైమ్ రేట్ తగ్గిందని పోలీసులు గతేడాది నేరాల గణాంకాలను డిసెంబర్లో రిలీజ్ చేశారు. కొత్త ఏడాది మొదలైందో లేదో నేరగాళ్లు పంజా విసురుతున్నారు. 2023 ప్రారంభంలోనే పోలీసులకు చుక్కలు చూపిస్తూ సవాల్ విసురుతున్నారు. చైన్ స్నాచర్ల టాపిక్ మర్చిపోకముందే మరో దోపిడీ కేసు వెలుగులోకి వచ్చింది. 



బార్ యాజమానిని బెదిరించి రూ.2కోట్లు దోపిడీ
వనస్థలిపురంలో ఓ బార్ యాజమాని నుంచి రెండు కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్టు తెలుస్తోంది. గతరాత్రి బార్ రెండు బార్లు, వైన్ షాపుల నుంచి కలెక్షన్లు తీసుకుని ఇంటికి వెళ్తున్న మేనేజర్ వెంకట్రామిరెడ్డిని దండగులు ఫాలో చేశారు. వనస్థలిపురం చౌరస్తాలో వెంకట్రామిరెడ్డిని అడ్డగించారు. అతనిపై దాడి చేసి  రూ.2 కోట్లు లాక్కెళ్లిన దుండగులు లాక్కెళ్లారు. పోలీసులు ఈ కేసను సీరియస్ గా తీసుకున్నారు.


ఒంటరిగా వెళ్తున్న మహిళలే టార్గెట్
రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలనను టార్గెట్ చేసుకుని మెడలో బంగారు మంగళసూత్రాలు, చైన్లను లాక్కెళ్తున్నారు. హైదరాబాద్ సిటీలో ఆరుచోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు కేటుగాళ్లు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పొద్దుపొద్దున రెండుచోట్ల గొలుసులు లాక్కెళ్లారు. మరోవైపు ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్ర నగర్ కాలనీలోనూ ఓ మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు వెంబడించినా దొరకకుండా పారిపోయాడు. 


ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా మంగళసూత్ర చోరీ
నాచారం పీఎస్ పరిధిలో నాగేంద్ర నగర్లో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న వృద్ధురాలి మెడలో 5తులాల మంగళసూత్రం తెంపుకెళ్లారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని రామాలయం గుండు దగ్గర కూడా మహిళ మెడలోని పుస్తెల తాడును లాక్కెళ్లారు. సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ నగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డారు. 


అంతరాష్ట్రముఠాగా అనుమామిస్తున్న పోలీసులు
బాధితుల ఫిర్యాదుతో పోలీసులు చైన్ స్నాచింగ్ కేసులను సీరియస్ గా తీసుకున్నారు. స్నాచింగులు జరిగిన చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. బైక్ పై వచ్చి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్స్ ను తర్వలో పట్టుకుంటామని చెబుతున్నారు. అంతరాష్ట్ర ముఠా పనిగా అనుమానిస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.