Prostitution Rocket Arrested In Hyderabad: హైదరాబాద్‌లోని (Hyderabad) గచ్చిబౌలి ప్రాంతంలో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టైంది. విదేశీ యువతులను ట్రాప్ చేసి వ్యభిచారం చేయిస్తోన్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గౌలిదొడ్డిలోని టీఎన్జీవో కాలనీలో పారిన్ అమ్మాయిలతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండగా.. పక్కా సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటీ, హెచ్‌టీఎఫ్ అధికారులు దాడులు చేశారు. కెన్యా, బ్యాంకాక్, టాంజానియాకు చెందిన యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 9 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దాడి చేసిన సమయంలోనే వ్యభిచారం గృహం నిర్వాహకులు పరారీ కాగా వారి కోసం గాలింపు చేపట్టారు. ఆన్ లైన్ ద్వారా ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ చేస్తున్నారు.
Crime News: గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు - విదేశీ యువతులను ట్రాప్ చేస్తోన్న ముఠా అరెస్ట్
Ganesh Guptha | 29 Jan 2025 12:22 PM (IST)
Hyderabad News: హైదరాబాద్ నగరంలో మరోసారి వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. గౌలిదొడ్డిలోని టీఎన్జీవో కాలనీలో విదేశీ యువతులతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు