Hyderabad News : హైదరాబాద్ నాగోల్ జరిగిన పెళ్లిలో గురువారం అర్ధరాత్రి పోలీసుల హంగామా చేశారు. పెళ్లికొడుకు తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా పరారీలో నిందితుడు కొడుకు పెళ్లిలో ప్రత్యక్షం అవ్వడంతో కాపుకాసిన మేడ్చల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. శుభం ఫంక్షన్ హాల్లో తెల్లవారుజామున పెళ్లి కొడుకు తండ్రి  శ్రీనివాస్ అరెస్ట్ చేశారు. ఒక కేసులో శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు.  ఒకవైపు పెళ్లి జరుగుతుండగా తండ్రిని అరెస్టు చేయడంతో పెళ్లిలో గందరగోళం నెలకొంది. 


అసలేం జరిగింది? 


 మేడ్చల్ జిల్లాలో ఓ పాత నేరస్థుడిని సినీఫక్కీలో పోలీసులు అరెస్టు చేశారు. కుతాడి శ్రీనివాస్ అలియాస్ ఎరుకల శ్రీనుపై మేడ్చల్ పోలీస్టేషన్ లో 7 కేసులు, అల్వాల్ లో 7 కేసులు, జవహర్ నగర్ లో ఓ కేసు నమోదై ఉన్నట్లు మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. పెండింగ్ కేసుల విషయంలో పోలీసులకు సహకరించకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. నగర శివారు నాగోల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో శ్రీనివాస్ కుమారుడి పెళ్లి జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అదును చూసి అర్ధరాత్రి సమయంలో కుతాడి శ్రీనివాస్ ను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుతాడి శ్రీనివాస్ గతంలో అనేక చోట్ల భూదందాలు చేసి కొనుగోలుదారులను మోసం చేయడం, ఎదురు తిరిగితే బెదిరింపులకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. పోలీసులకు దొరకకుండా దిల్లీ, దుబాయ్ లలో తలదాచుకున్న శ్రీనివాస్ ... కొడుకు పెండ్లి కోసం హైదరాబాద్  వచ్చినట్లు తెలిసి కాపుకాసి అరెస్టు చేశామన్నారు పోలీసులు.


సింగర్ యశస్విపై చీటింగ్ ఆరోపణలు 


సింగర్ యశస్వి కొండెపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘జాను’ సినిమాలో ‘లైఫ్ ఆఫ్ రామ్’ అనే పాట ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఓ ఛానెల్ లో ప్రసారం అయ్యే పాటల షో ద్వారా మంచి పేరు సంపాదించాడు.  తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు.  


ఇంతకీ వివాదం ఏంటంటే?


యశస్వి ఇటీవల ఓ షోలో పాల్గొన్నాడు. తాను చేసిన పలు సేవా కార్యక్రమాల గురించి అందులో వివరించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోపై కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు ఫరౌ కౌసర్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అదంతా తప్పుడు ప్రచారమని వెల్లడించింది. నవసేన ఎన్జీవో ద్వారా చాలా మందిని చదివిస్తున్నట్లు చెప్పాడని, అదంతా అవాస్తవం అని ఆమె వెల్లడించింది. యశస్వి నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని వెల్లడించింది. తమ సంస్థ పేరు చెప్పుకుని లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాడని  కౌసర్‌ ఆరోపించింది.   


రోపణలపై యశస్వి స్పందన ఏంటంటే?  


కౌసర్ ఆరోపణలపై యశస్వి స్పందించాడు. నవసేన ఎన్జీవోలోని పిల్లలకు సాయం చేస్తున్నట్లు, వారిని దత్తత తీసుకున్నట్లు తాను ఎక్కడా చెప్పలేదని వెల్లడించాడు. తాను వాళ్ల దగ్గరికి కూడా వెళ్లలేదని చెప్పాడు. తనకు వారికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. సాధ్య ఫౌండేషన్‌కు తమ ఫ్యామిలీ సాయం చేస్తుందని, ఆ ఫౌండేషన్‌ తమకు నచ్చిన సంస్థలకు సాయం చేస్తుంటుందన్నాడు. అలా వాళ్లు కాకినాడలోని ఓ అనాథాశ్రమానికి సాయం చేశారని చెప్పాడు. ఆ ఫౌండేషన్ వాళ్లు నవసేన ట్రస్టుకి మూడు, నాలుగుసార్లు సాయం చేసినట్లు వెల్లడించారు. కాబట్టి వాళ్లతో ఆల్‌ ది బెస్ట్‌ చెప్పించుకున్నట్లు తెలిపాడు.